బాలీవుడ్ లో నెంబర్ వన్ రేస్ లో ఉన్న హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇప్పుడు బాలీవుడ్, హాలీవుడ్ లో తన సత్తా చాటుతున్నారు.  తాజాగా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన భావనకు వివాహ శుభాకాంక్షలు తెలుపారు ప్రియాంక. అంతే కాదు ఈ సందర్భంగా భావన ఆత్మస్థైర్యం గురించి తెగ మెచ్చుకుంటూ ఓ విడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో భావ‌న‌ను గొప్ప మ‌హిళ‌, ధైర్య‌వంతురాలిగా కొనియాడింది.

ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మళియాళ బ్యూటీ భావన పెళ్లికూతురైంది. సోమవారం తన ప్రియుడు, నిర్మాత నవీన్‌తో ఆమె ఏడడుగులు వేయనుంది. ఈ సందర్భంగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ‘నీ జీవిత గమనంలో ఇదో గొప్ప అడుగుగా మారబోతోంది.

నువ్వొక సాహసవంతమైన, ధైర్యమైన, అద్భుతమైన మహిళవి. నేను నిన్ను ఎంతో ఆరాధిస్తాను.. ప్రేమిస్తాను. విష్ యూ ఎ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. గుడ్ లక్..’ అంటూ భావనకు ప్రియాంక చోప్రా అభినందనలు తెలిపింది.  కాగా, 2017 మార్చి 9న నవీన్‌‌తో భావన ఎంగేజ్‌మెంట్ జగింది. కన్నడ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్న నవీన్‌.. చిన్ననాటి నుంచే భావనకు మంచి మిత్రుడు.

వీరి వివాహాన్ని సింపుల్‌గానే జరుపుకున్నా.. పెళ్లి రిసెప్షన్‌కు భారీగానే ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.కాగా గతేడాది మార్చిలో నవీన్‌తో భావన నిశ్చితార్ధం జరిగింది.  'హీరో', 'మహాత్మ', 'నిప్పు' సినిమాలతో భావన తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: