తెలుగు ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు వారసులుగా మంచు విష్ణు, మనోజ్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ మంచు విష్ణు కి ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు పెద్దగా లేవనే చెప్పొచ్చు.  ఆ మద్య శీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘ఢీ’మంచి విజయం సాధించింది.  ఆ రేంజ్ లో మరో విజయం ఇప్పటి వరకు మనోడికి దక్కలేదు.  తాజాగా మంచు విష్ణు హీరోగా, కామెడీ కింగ్ బ్రహ్మానందం మరో ప్రధాన పాత్రలో నటించిన కామెడీ ఎంటర్‌ట్రైనర్ ‘ఆచారి అమెరికా యాత్ర’జనవరి 26న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. 
DT5Lu2DUMAAMChZ
ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.  మొన్న ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా చేశారు. ఇదిలా ఉంటే  ‘ఆచారి అమెరికా యాత్ర’ విడుదలకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఈ మూవీని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. విడుదలకు మరో నాలుగు రోజుల మాత్రమే మిగిలి ఉండటంతో ముందుగా అనుకున్న సమయానికి ‘ఆచారి అమెరికా యాత్ర’థియేటర్‌లోకి రావడంలేదు. 
Image result for achari america yatra stills
గతంలో నాగేశ్వర్ రెడ్డి - విష్ణుల కలయికలో వచ్చిన ‘దేనికైనా రెడీ’, ‘ఈడో రకం ఆడో రకం’ సినిమాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి హిట్ చిత్రాలుగా నిలవడంతో ఈ కాంబోకి హ్యాట్రిక్ ఖాయమే అని ధీమాగా ఉంది చిత్ర యూనిట్.  అంతే కాదు గతంలో బ్రహ్మానందం, విష్ణు కాంబినేషన్ లో కడుపుబ్బా నవ్వించే సీన్లు కనిపిస్తున్నాయి.  ఈ చిత్రంలో విష్ణు సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. తమన్ సంగీతాన్ని అందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: