రాజు రవితేజ పేరు వినగానే 2014 ప్రాంతంలో పవన్ రచించిన ‘ఇజమ్’ గుర్తుకు వస్తుంది. అప్పట్లో ఈ పుస్తకం పై చాల చర్చలు జరిగాయి. పవన్ రాజకీయ సిద్ధాంతాలను ఆలోచనలను విశ్లేషించే పుస్తకంగా అప్పట్లో ఈ పుస్తకానికి బాగా పేరు వచ్చింది. ఈ పుస్తకాన్ని పవన్ రాజు రవితేజాతో కలిసి రచించాడు. అయితే ఆతరువాత పవన్ కాంపౌండ్ లో రవితేజా పెద్దగా కనిపించకపోవడంతో ఈయనకు ఏమైంది అన్న అనుమానాలు వచ్చాయి.

 PAVAN KALYAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

అయితే మొన్న పవన్ సైంట్ మేరీస్ చర్చలో పోలెండ్ అంబాసిడర్ తో పాటు ఆదేశానికి చెందిన విధ్యార్ధులతో రాజకీయాల పై చర్చలు చేయడానికి వెనుక సూత్రధారి రాజు రవితేజ అని తెలుస్తోంది. వాస్తవానికి పవన్ జాతీయ స్థాయిలో పేరు గాంచిన రాజకీయ నాయకుడు కాడు. అయితే పోలెండ్ విద్యార్ధులు పవన్ ను కలిసి రాజకీయాల పై ప్రశ్నలు వేయడం ఏమిటి అంటూ చాలామంది తమ ఆశ్చర్యాన్ని వ్యక్త పరిచారు.

PAVAN KALYAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం 

అయితే ఈ విషయాలలోకి వెళితే రాజు రవితేజ ఈ వ్యవహారాన్ని అంతా తెర వెనుక ఉండి నడిపించినట్లు తెలుస్తోంది. పవన్ సన్నిహితుడుగా పేరు గాంచిన రాజు రవితేజ అనేక ప్రముఖ క్రిష్టియన్ మిషనరీలకు అదేవిధంగా అనేక అంతర్జాతీయ కంపెనీలకు సలహాదారుడుగా కొనసాగుతున్నాడు. ఈ పరిచయాలతోనే రాజు రవితేజ పోలెండ్ అంబాసిడర్ ను పవన్ కళ్యాణ్ ‘జనసేన’ ఆఫీసుకు వచ్చే విధంగా వ్యవహారం నడిపించాడు అని టాక్.

 PAVAN KALYAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం 

అంతేకాదు ప్రస్తుతం రాజకీయాలకు సంబంధించి పవన్ ఆలోచనలను ఎత్తుగడలను రాజు రవితేజ బాగా ప్రభావితం చేస్తున్నాడని పవన్ రాజకీయ ఎత్తుగడలకు సంబంధించి నిర్వహిస్తున్న రహస్య సమాలోచనలలో రాజు రవితేజ కీలక పాత్ర వహిస్తూ తన సలహాలతో తిరిగి పవన్ ను ప్రభావితం చేస్తున్నాడని టాక్. దీనితో పవన్ సన్నిహితుల జాబితాలో తిరిగి రాజు రవితేజ ప్రవేశించాడు అంటూ వార్తల హల్ చల్ చేస్తున్నాయి.. 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: