‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్‌ కు రామ్ చరణ్ తెలిపిన శుభాకాంక్షలు ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. దీనితో చిరంజీవి పవన్ ల మార్గాలు వేరు అయినా గమ్యం ఒకటే అనే సంకేతాన్ని చరణ్ మళ్ళీ మరోసారి తెరపైకి తీసుకువచ్చాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. నిన్న పవన్ తెలంగాణలో తన పర్యటన ప్రారంభించిన విషయం తెలిసిందే.  

 తెలంగాణలో పవన్

 

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం దర్శనం తరువాత పవన్ తెలంగాణాలో మూడురోజుల పాటు అభిమానులకు నాయకులకు అందుబాటలో ఉండబోతున్నాడు. ఈసందర్భంగా నిన్న పవన్ మాట్లుడుతూ తన రాజకీయాలకు చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. అంతేకాదు తన రాజకీయ జీవితానికి కుటుంబ సభ్యుల మద్దతు లేదని కూడా పవన్ కళ్యాణ్ తెలియచేసాడు.   

 RAMCHARAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

అయితే ఇలా పవన్ ప్రకటించిన కాసేపటికే బాబాయికి చెర్రీ శుభాకాంక్షలు తెలిపడం హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ చరణ్ ‘నేను ఓ భారతీయుడిని, నా జన్మభూమిని రక్షించుకొనే బాధ్యత నాపై ఉంది.' అని కామెంట్ పెట్టి తన బాబాయి పవన్ చేపట్టిన ఈ యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నానని ట్విట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.I’m an Indian. I care for my motherland”-Pawan KalyanWhat an energetic start of Chalo re Chalo re chal. Babai, wishing you all the best!! Jai Jana Sena!! ✊🏼 అంటూ ట్విట్  చేసాడు

 పవన్ అలా చెప్పిన కాసేపటికే

ఇప్పుడు ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా పవన్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. 'బాబాయ్ మీకు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నా. జై జనసేన' అంటూ చరణ్ పవన్ ఫోటో పెట్టి చేసిన కామెంట్స్ తో పవన్ వెనుక మొత్తం మెగా ఫ్యామిలీ ఉంది అన్న సంకేతాలు వస్తున్నాయి. దీనితో పవన్ అనుసరించబోయే భవిష్యత్ రాజకీయ ఎత్తుగడలకు ప్రత్యక్షంగా చిరంజీవి సపోర్ట్ చేయకపోయినా పరోక్షంగా మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండబోతోంది అన్న సంకేతాలు చరణ్ చేసిన ట్విట్ వెనుక ఉన్నాయి అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..






మరింత సమాచారం తెలుసుకోండి: