నిన్న పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ సమన్వయ కార్యకర్తల సమావేశంలో చేసిన అనేక ఆసక్తికర కామెంట్స్ పై ఇప్పుడు లోతైన చర్చలు జరుగుతున్నాయి. సమాజంలో పెద్ద స్థాయిలో మార్పు తేవాలంటే పొలిటికల్ ప్రాసెస్ లోనే తేవాలి అని అంటూ ఆ విషయాన్ని తాను నమ్మాను కాబట్టి తాను రాజకీయాల వైపు వచ్చాను అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు పవన్.

 నన్ను తిడుతుంటే మీకు ఇబ్బంది అనిపించవచ్చు

కొంత మందికి ఎక్కువ ధనం సంపాదించాలని ఉంటుంది. అదేవిధంగా మరి కొంత మందికి కీర్తి మరియు అధికారం సంపాధించాలని ఉంటుంది అని చెపుతూ తనకు ఎంత సాధ్యం అయితే అంత ఎక్కువ మందికి సహాయం చేయాలని కోరిక ఉంది అని అంటూ అదే తన ‘జనసేన’ పార్టీ సిద్ధాంతం అని అన్నాడు పవన్. తాను సౌతిండియాలో హయ్యెస్ట్ టాక్స్ కడుతున్న వారిలో ఒకడిని అని అంటూ హాయిగా సినిమాలు చేసుకుంటూ ఉంటూ ఉండిపోవడం ఇష్టం లేక ఇలా రాజకీయాల వైపు వచ్చాను అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు పవన్.

 సినిమాల కంటే కూడా రాజకీయాలు నాకు ప్రాణం

ఇదే సందర్భంలో పవన్ తన పై ఘాటైన విమర్శలతో టార్గెట్ చేస్తున్న వ్యక్తులను ముఖ్యంగా కత్తి మహేష్ ను అన్యాపదేశంగా దృష్టిలో పెట్టుకుని కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. కొందరు తనను తిడుతుంటే తన అభిమానులకు ఇబ్బంది అని పించవచ్చు అని చెపుతూ తాను వాటిని భరిస్తాను బలవంతుడుకే విమర్శలను తట్టుకునే శక్తి ఉంటుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు జనసేనాని.

 ఆగిపోవడం ఇష్టం లేదు

ఇటీవల విడుదలైన ‘అజ్ఞాతవాసి' ఫ్లాప్ గురించి పరోక్షంగా మాట్లాడుతూ తనకు తన సినిమా ఫెయిల్ అయి తిట్లు తినడం కంటే రాజకీయాలలో ఫెయిల్ అయి తిట్లు తినడం ఇష్టం అంటూ తన పై తానే జోక్ చేసుకున్నాడు పవన్. ఇదే సందర్భంలో తన మొండి తనం గురించి మాట్లాడుతూ పాలిటిక్స్ లో కష్టాలు ఉంటాయి అని చెపుతూ వాటిని భరించడానికే తాను వచ్చాను అన్న సంకేతాలు ఇస్తూ తనను మాటలతో ఎంత హింసించినా తనలోని మొండితనం రోజురోజుకు పెరిగి పోతుంది అని చెపుతూ తాను ఎవరి విమర్శలను లెక్క చేయను అన్న సంకేతాలు ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. దీనితో పవన్ చేసిన కామెంట్స్ వెనుక అర్ధాలను వెతుకుతూ విమర్శకులు పవన్ వ్యక్తిత్వంలోని కనిపించని కోణాలను వెతికే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నారు.. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: