తెలుగు ఇండస్ట్రీలోకి ‘ఇష్టం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రియ తర్వాత అత్ర హీరోలతో నటించి అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది.  ఈ అమ్మడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించింది.  అయితే కెరీర్ లో ఇప్పటికీ చాలా గ్లామర్ గా కనిపిస్తూ..తన అందచందాలతో ఆకట్టుకుంటూ కుర్ర హీరోయిన్లకు ధీటుగా చాన్సులు కొట్టేస్తుంది.  ఈ విషయంపై మీడియా మీకు ఆఫర్లు ఎలా వస్తున్నాయి..మీడియాపై  నటి శ్రియ ఫైర్ అయింది.   హాలీవుడ్ నటీమణులు 60 ఏళ్ల వరకు నటిస్తున్నారని, తనకు మాత్రం ఆఫర్లు వస్తుంటే ఆశ్చర్యపోతున్నారని దుయ్యబట్టింది.
Image result for shriya saran
అసలు ఇలాంటి ప్రశ్నలు అడగడానికి మీడియాకు నోరెలా వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది.  ప్రస్తుతం మోహన్ బాబు నటిస్తున్న ‘గాయత్రి’ చిత్రంలో నటిస్తున్న శ్రియ ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..మోహన్‌బాబు గారితో నటించలేకపోయానన్న బాధ ఈ సినిమాతో తీరిపోయిందని శ్రియ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో తన నిడివి తక్కువైనా కథను మలుపు తిప్పే కీలక పాత్ర తనదని పేర్కొంది. 
Image result for shriya saran hot
ఈ మద్య తనకు వస్తున్న ఆఫర్ల విషయం గురించి మాట్లాడుతూ..తన కోసం దర్శకులు, రచయితలు కొత్త పాత్రలు సృష్టిస్తున్నారని తెలిపింది. ప్రేక్షకులు ఇంకా తనను  ఆదరిస్తుండడం వల్లే ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లయినా ఇంకా కొనసాగుతున్నానని వివరించింది.

హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ 60 ఏళ్ల వరకు నటించిందని గుర్తు చేసిన శ్రియ తన లాంటి వాళ్లను మాత్రం ప్రశ్నిస్తున్నారని, మీడియా తన ధోరణి మార్చుకుంటే మంచిదని హితవు పలికింది. తన 18 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటి వరకు 90 సినిమాల్లో నటించినట్టు శ్రియ వివరించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: