టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ తరహా చిత్రాలకు ప్రాణం పోసిన హీరో ఎవరంటే వెంటనే చెబుతారు..నటసింహం బాలకృష్ణ అని.  తెలుగు పరిశ్రమకి తొడగొట్టి....మీసం మెలేసే మేనరిజంని పరిచయం చేసిన హీరో బాలకృష్ణ. ఇప్పటికీ ఆయన కుర్రహీరోలతో పోటీ పడి నటిస్తున్నారు.  యాక్షన్ తరహా చిత్రాల్లో బాలకృష్ణ స్టైలే వేరు. ఫిజికల్ గా బాలయ్య ఎంత ఫిట్ అన్నది చెప్పడానికి ఆయన సినిమాలు చూస్తే చాలు.
Image result for బాల‌కృష్ణ కుడిభుజం
అయితే కొంతకాలంగా కుడిభుజం నొప్పితో సతమతమవుతున్న  నందమూరి బాలకృష్ణకు శనివారం కాంటినెంటల్‌ ఆస్పత్రిలో విజయవంతంగా చికిత్స చేయించుకున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్‌లో ఆయన కుడిచేతికి గాయమైంది. అప్పటి నుంచి ఆయన రొటేటర్‌ కఫ్‌ టియర్స్‌ ఆఫ్‌ షోల్డర్‌ పెయిన్‌’తో సతమతమవుతున్నారు.
Related image
పైసా వసూల్, జై సింహ సినిమాల షూటింగ్ బిజీ షెడ్యుల్స్ కారణంగా సర్జరీ వాయిదా వేసుకుంటూ వచ్చారు హీరో బాలకృష్ణ.   గంటసేపు జరిగిన శాస్త్ర చికిత్స సక్సెస్ అయ్యిందని అధికారికంగా ప్రకటించారు.  సోమవారం ఉదయం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కొద్దిరోజుల్లో ఆయన షూటింగ్ లో పాల్గొనవచ్చని డాక్టర్లు చెప్పారు.
Image result for jai simha
క‌న్సల్టెంట్ ఆర్థోపెడిక్ స‌ర్జన్ డాక్టర్ దీప్తి నంద‌న్ రెడ్డి, డాక్టర్ ఆశిష్ బాబుల్కార్ (పూణే)లు బాలయ్య కుడిచేయికి స‌ర్జరీ చేశారు. రెండు రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న ఆయన నేడు డిశ్చార్జి అయ్యారు. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని బాలయ్యకు డాక్టర్లు సూచించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: