తెలుగు ఇండస్ట్రీలో టాప్ దర్శకుల్లో ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు.  స్టూడెంట్ నెం.1 చిత్రంతో దర్శకుడిగా మారిన రాజమౌళి ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఫ్లాప్ చిత్రం తెరకెక్కించలేదు. అంతే కాదు మెగా అబ్బాయి రాంచరణ్ తో తెరకెక్కించిన ‘మగధీర’ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రికార్డుల మోత మోగించింది.  ఆ తర్వాత నాని తో ఈగ చిత్రాన్ని తీశారు..హీరో లేకున్నా ఒక చిన్న ప్రాణితో సినిమాలో అద్భుతం సృష్టించారు. ఇక బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో ఏకంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. 
Related image
భారత దేశంలో బాహుబలి 2 అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచిపోయింది.  రాజమౌళి అంతర్జాతీయంగా కూడా సంచలన దర్శకుడిగా మారిపోయారు. టాలీవుడ్ బడ్జెట్ ప్రమాణాలు మారిపోయాయి అంటే అంది రాజమౌళి చలవే. బాహుబలి చిత్రం అంతలా ప్రాభవం చూపింది. బాహుబలితో రాజమౌళి తెలుగు సినిమా మార్కెట్ లెక్కలన్నీ మార్చేశారు.  ఇక తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో మూడు చిత్రాలు వచ్చాయి. స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ.
Image result for rajamouli
అయితే సింహాద్రి చిత్రంలో నటించిన భాను చందర్ ఈ మద్య ఓ ఇంటర్య్యూలో మాట్లాడుతూ..రాజమౌళి గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.  సింహాద్రి చిత్రం డబ్బింగ్ పూర్తయ్యాక రాజమౌళిని రమ్మని అడిగానని భాను చందర్ అన్నారు. ఏంటి సార్ పిలిచారట అని రాజమౌళి అడిగారు. మీరు సెన్సేషనల్ దర్శకులు అవుతారు అని చెప్పానని భానుచందర్ అన్నారు. ‘‘బాహుబలి సినిమా తీసిన రాజమౌళి కూడా ఒకప్పుడు చిన్న దర్శకుడే. శాంతినివాసం అనే సీరియల్ కూడా రాజమౌళి చేశారు.
Image result for simhadri
అప్పుడు చిన్న దర్శకుడే. కానీ ఆయన టాలెంట్‌తో ఈ రోజు ప్రపంచం గుర్తించే స్థాయికి చేరుకున్నారు. టాలెంట్‌కి చిన్న, పెద్ద అనే తేడా ఉండదు. సింహాద్రి సూపర్ డూపర్ హిట్ కావడం ఖాయం అని రాజమౌళికి అప్పుడే చెప్పా. భవిష్యత్తులో మీరు సంచలన దర్శకుడిగా మారుతారు. ఆ రోజు నేను మీకు ఫోన్ చేస్తా. కానీ మీరు నాఫోన్ కి కూడా దొరకరు అంటూ రాజమౌళితో చెప్పానని భానుచందర్ వ్యాఖ్యానించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: