మెగా సుప్రీమ్ హీరో లేటెస్ట్ సినిమా ఇంటిలిజెంట్‌. సాయిధ‌ర‌మ్ - లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా స్టార్ డైరెక్ట‌ర్ వివి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో అగ్ర నిర్మాత సీ క‌ళ్యాణ్ నిర్మించిన ఈ యాక్ష‌న్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ శుక్ర‌వారం వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. సాయిధ‌ర‌మ్ వ‌రుస‌గా నాలుగు ప్లాపు సినిమాలు (తిక్క - విన్న‌ర్ - న‌క్ష‌త్రం - జ‌వాన్‌) ఇచ్చినా కూడా ఇంటిలిజెంట్ సినిమాకు మాత్రం సాయి కెరీర్‌లోనే ఏ సినిమాకు జ‌ర‌గ‌నంత‌గా రికార్డు స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది.

Image result for sai dharam tej intelligent

ఈ సినిమా డైరెక్ట‌ర్ వినాయ‌క్ ఖైదీ నెంబ‌ర్ 150 లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత తెర‌కెక్కించిన సినిమా కావ‌డంతో పాటు సీ క‌ళ్యాణ్ జై సింహాతో రైజ్‌లో ఉండ‌డం, ఇంటిలిజెంట్‌పై మాస్ ప్రేక్ష‌కుల్లోనూ, బీ, సీ సెంట‌ర్ల‌లో మంచి అంచ‌నాలు ఉండ‌డంతో అన్ని ఏరియాల్లోనూ మంచి రేటు ప‌లికింది. ఓవ‌ర్సీస్‌లో ఈ సినిమాను ఓన్‌గా రిలీజ్ చేసుకుంటున్నారు. ఓవ‌ర్సీస్ మిన‌హాయిస్తే మిగిలిన అన్ని ఏరియాలు క‌లుపుకుని ఇంటిలిజెంట్ ఓవ‌రాల్‌గా రూ 26.50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది.

Image result for sai dharam tej intelligent

' ఇంటిలిజెంట్ ' ఏరియా వైజ్ ప్రి రిలీజ్ బిజినెస్ : (రూ.కోట్ల‌లో)
నైజాం- 6.30
సీడెడ్ - 5.40
ఆంధ్రా - 13.50
------------------------------ 
ఏపీ+తెలంగాణ = 25.20
------------------------------
రెస్టాఫ్ ఇండియా - 1.30
----------------------------------------
టోట‌ల్ ఇండియా - 26.50 కోట్లు
----------------------------------------


మరింత సమాచారం తెలుసుకోండి: