నాగశౌర్య.. తెలుగులో వస్తున్న కొత్త కుర్రాళ్లలో కాస్త విషయం ఉన్నవాడిలా కనిపిస్తున్నాడు.. ఒక్కో సినిమాతో అంచనాలు పెంచుకుంటూ పోతున్నాడు. కొన్ని ఫ్లాపులు ఎదురైనా ఒకటి, రెండు హిట్లు అందుకున్నాడు. ఇప్పుడు ఏకంగా సొంతంగా సినిమా నిర్మించి చక్కటి హిట్ అందుకున్నాడు. ఇటీవల వచ్చిన ఈ కుర్రాడి సినిమా ఛలో మంచి కామెడీ ఎంటర్ టైనర్ గా పేరు తెచ్చుకుంది. 

Chalo Movie  Naga Shourya, Rashmika కోసం చిత్ర ఫలితం
ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా.. హీరోయిజం చూపకుండా.. ఆకట్టుకునే కథతో మ్యాజిక్ చేశాడు. సినిమా హిట్టయ్యింది సరే. మరి ఇంతకీ ఈ కుర్రాడు మిగిలిన హీరోలతో ఎలా ఉంటాడు.. ఎవరితో కలివిడిగా ఉంటాడు.. ఇవే ప్రశ్నలు వేస్తే నాగశౌర్య చెప్పిన సమాధానాలు భలే ఇంట్రస్టింగా ఉన్నాయి. నవతరం కుర్రాళ్లంతా బాగానే కలివిడిగా ఉంటారట. 
కానీ నాగశౌర్యనే పెద్దగా ఎవరితోనూ కలవడంట.

NITIN కోసం చిత్ర ఫలితం

అది తన మైనస్ పాయింట్ అని ఒప్పుకుంటున్నాడీ కుర్ర హీరో.. ఇక తన లేటెస్ట్ హిట్ చలో చూసి ఈ కుర్రహీరోలు భాగానే ఎప్రిషియేట్ చేశారట. ప్రత్యేకించి నితిన్‌, నారా రోహిత్‌, అవసరాల శ్రీనివాస్‌.. అంతా భలే తీశావోయ్.. అని మెచ్చుకున్నారట. ఈ సమయంలోనే నాగశౌర్య నితిన్ పై ఓ ఇంట్రస్టింగా కామెంట్ చేశాడు. నితిన్ తమలాంటి కుర్రహీరోలందరికీ స్ఫూర్తి అంటున్నాడు.. 

సంబంధిత చిత్రం
ఎందుకంటారా.. అదే అడిగితే.. వరుసగా ఎన్ని ఫ్లాపులు వచ్చినా తట్టుకుని నిలబడినందుకట. అదే మాలాంటి కుర్రాళ్లైతే.. ఒకట్రెండు పరాజయాలకే అల్లాడిపోతున్నాం కదా.. అంటూ బదులిచ్చాడు. అదీ నిజమే కదా.. కానీ ఇక్కడే ఓ చిన్న అనుమానం.. నాగశౌర్య నితిన్ ను మెచ్చుకున్నాడా.. లేక అన్ని ఫ్లాపులు వచ్చాయని గుర్తు చేసి సెటైర్ వేశాడా..అబ్బే అదేం లేదు లెండి. నిజంగా పొగిడేఉంటాడు. ఏమంటారు.



మరింత సమాచారం తెలుసుకోండి: