బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సన్నీలియోన్ ‘జిస్మ్ 2’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  వాస్తవానికి ఈ అమ్మడు హాలీవుడ్ లో ఫోర్న్ స్టార్. అయితే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫోర్న్ చిత్రాలకు గుడ్ బాయ్ చెప్పిన సన్నీలియోన్ అతి తక్కువ కాలంలోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఏమాత్రం సిగ్గూ బిడియం లేకుండా శృంగార పాత్రల్లో నటించే సన్నీలియోన్ హాట్ సీన్స్ కుర్రాళ్లకు పిచ్చేక్కించేవి.  బాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్, టాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు తన ప్రతాపాన్ని చూపిస్తుంది. 
Image result for sunny leone banner nellor
ఆ మద్య డాక్టర్ రాజశేఖర్ నటించిన ‘గరుడ వేగ’ చిత్రంలో డియ్యో డియ్యో సాంగ్ తో దుమ్ముదులిపింది.  ఆ సినిమాకు ఈ పాట హైలెట్ అనే చెప్పొచ్చు.  తాజాగా సన్నీలియోన్ ఫోటో తో ఓ వినూత్న ప్రయోగం చేశారు. నరదిష్టికి నల్లరాయి కూడా మాడిమసైపోతుందని చెబుతారు. ఇక ఇటువంటి వాటిని తాము ఏమాత్రం నమ్మబోమని చెప్పే వారు కూడా ఇళ్లలో దిష్టి యంత్రాలు పెడుతుంటారు.  దిష్టిబొమ్మకు సన్నీలియోన్ కి సంబంధం ఏంటా అనుకుంటున్నారా..!  శ్రీ పొట్టిశ్రీరాములు జిల్లా దుత్తలూరు మండలం బండకిందపల్లి, బ్రహ్మేశ్వరం గ్రామాల రైతులు బెండ, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి పంటలను సాగుచేస్తున్నారు.
Image result for sunny leone
మొక్కలు పచ్చగా ఎదిగి ఆకర్షణీయంగా ఉండడంతో దారిన పోయే వారు అటువైపు చూడకుండా ఉండలేకపోతున్నారు. దీంతో పచ్చటి పొలాలు పంటదిగుబడి తగ్గిపోతుందట. అక్కడి జనాల దృష్టి మొత్తం తమ పంటలపైనే ఉండడంతో దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన చెందిన రైతులు.. వారి దృష్టిని పంటల మీది నుంచి మళ్లించేందుకు పొలం గట్లపై పై సన్నీలియోన్ అర్ధనగ్న బ్యానర్లను ఏర్పాటు చేశారు.
Image result for sunny leone
అంతే కాదు ఆ బ్యానర్ పై అక్కడితో ఆగిపోలేదు.. ‘ఒరేయ్, నన్ను చూసి ఏడవకురా’ అని కింద స్లోగన్ కూడా రాయించారు. ఇప్పుడీ బ్యానర్లు హాట్ టాపిక్ అయ్యాయి. మిగతా రైతులు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. ఎవరో ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ వార్త వైరల్ అయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: