బాలీవుడ్ ఇండస్ట్రీలో సహజనటుడిగా పేరు తెచ్చుకున్న నానా పటేకర్ తీసింది తక్కువ చిత్రాలే అయినా పేరు మాత్రం బాగా వచ్చింది.  ఆయన డైలాగ్స్ పంచ్ లు సినిమా థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు ఎమోషనల్ కావాల్సిందే.  అయితే కొంత కాలంగా ఆయన సినిమాలు చాలా తక్కువ తీస్తున్నారు..ఒకదశలో అసలు సినిమాలే మానేశారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. 
Image result for rajinikanth kaala movie stills
సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే నానాపటేకర్ ఆ మద్య రాజకీయాలపై తనదైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నానా పటేకర్ సూప‌ర్‌స్టార్  రజనీకాంత్ నటిస్తున్న ‘కాలా’ చిత్రంలో నటిస్తున్నారు.   ఓ ఇంటర్వ్యూలో నానా పటేకర్ మాట్లాడుతూ..తనకు తమిళ సినిమా చేసే ఉద్దేశం ఎప్పుడూ లేద‌ని బాలీవుడ్ న‌టుడు  నానా పటేకర్ తెలిపాడు.
Image result for rajinikanth nanapatekar
కేవలనం సూప‌ర్‌స్టార్  రజనీకాంత్  కోరినందువల్లే కాలా సినిమాలో నటించేందుకు అంగీకరించానని తెలిపారు. ప్రస్తుతం నిర‍్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు.  ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ వర్కులు కూడా మొదలయ్యాయి.  అయితే కాలా చిత్రంలో నానా పటేకర్ విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: