ఇప్పుడు బాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న హీరో ఎవరయ్యా అంటే వెంటనే చెబుతారు..రణ్ వీర్ సింగ్.  చిన్నా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా హీరో, విలన్ అనే వ్యత్యాసానికి తావు ఇవ్వకుండా ఏ పాత్రైనా ఒకే చెబుతూ..నటిస్తున్నాడు రణ్ వీర్ సింగ్.  ఈ మద్య ‘పద్మావతి’ చిత్రంలో మెయిన్ విలన్ గా నటించి అందరిచేత షబాష్ అనిపించుకున్నాడు. 
Image result for ranveer singh
చిన్న హీరోగా ఎంట్రీ ఇచ్చి..ఇప్పుడు స్టార్ హీరోగా బిజీగా ఉన్నాడు.భారీ విజయాలు నమోదు చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌కి రోజురోజుకీ ఫాలోయింగ్ పెరిగిపోతోంది.  ఈ మద్య సెలబ్రెటీలకు పెద్ద పార్టీలు, పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేసినందుకు మంచి రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.  ఇప్పుడు రణ్ వీర్ తో పెళ్లిల్లో డ్యాన్స్ చేయించాలని కూడా కొందరు ముచ్చట పడుతున్నారు. ఇటీవల ఓ శ్రీమంతుడు తన ఇంట్లో జరిగే పెళ్లికి రణ్‌వీర్‌ అర్ధగంట పాటు డ్యాన్స్‌ చేయాలని, రూ.2 కోట్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు.
Image result for ranveer singh
అయితే, ‘గల్లీబాయ్‌’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న రణ్‌వీర్ సింగ్ అతడి కోరికను సున్నితంగా తిరస్కరించాడట. పెళ్లికి వచ్చి డ్యాన్స్‌ చేస్తే సినిమాలో తన పాత్రపై శ్రద్ధ పెట్టలేనని చెప్పాడట. కాగా, ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘పద్మావత్‌’ సినిమాల్లో నటించి భారీ విజయాలను అందుకున్న రణ్‌వీర్ సింగ్.


మరింత సమాచారం తెలుసుకోండి: