మరికొద్ది రోజులలో మొదలు కాబోతున్న సమ్మర్ రేస్ ఇంకా ప్రారంభం కాకుండానే కాక పుట్టిస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసినా మోస్ట్ ఎవైటెడ్ సినిమాలు మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ ల గురించి చర్చలు వినిపిస్తున్నాయి. సుమారు 300 కోట్ల బిజినెస్ జరుగుతున్న ఈ రెండు సినిమాల ఫలితం పైనే భవిష్యత్ టాలీవుడ్ ఇండస్ట్రీ బిగ్ సినిమాల మార్కెట్ ఆధారపడి ఉంది అన్న కామెంట్స్ ఇప్పటికే ఉన్నాయి.
NAAPERU SURYA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇప్పుడు ఈ రెండు సినిమాలు అనేక ఊగిసలాటల తరువాత చిట్టచివరకు ఒకదానిని మరొకటి టార్గెట్ చేస్తూ ఒకేరోజు విడుదల అవుతున్నట్లుగా ప్రకటనలు ఇవ్వడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. మహేష్ బన్నీల లేటెస్ట్ సినిమాలు రెండు ఇప్పుడు తమకు తాముగా వార్ ను ప్రకటించుకుని ఏప్రియల్ 27న వార్ కు సిద్ధం అవుతున్నాయి.  
BHARATH ANU NENU MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తి మహేష్ బన్నీల సినిమాల వార్ పై చేసిన ఒక రాజీ ఫార్మలా కూడ తిరస్కరణకు గురి అయినట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలలో ఏ సినిమా ముందు విడుదలకు సిద్ధమవుతుందో ఆ సినిమాను ఏప్రిల్ 27న విడుదల చేయాలని ఆతరువాత మే నెలలో మరొక సినిమాను విడుదల చేయాలని పెద్ద మనుష్యుల అంగీకారానికి వచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీనితో మహేష్ బన్నీల వార్ జరగదు అనుకున్నారు అంతా. అయితే ఈ విషయాలు ఏమిపట్టించుకోకుండా ఈ రెండు సినిమా యూనిట్లు రెచ్చిపోతు మళ్ళీ లేటెస్ట్ ప్రకటనలు ఇవ్వడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.
PRODUCER BANNNY VAS LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ప్రస్తుతం జరుగుతున్న ఈ వ్యవహారాలను పరిశీలిస్తున్న విశ్లేషకులు మాత్రం ఈ వ్యవహారానికి అల్లు అర్జున్ సన్నిహితుడు బన్నీ వాస్ అనుసరిస్తున్న మితిమీరిన ఆత్మ విశ్వాసంతో కూడిన దూకుడు ఈ అనవసరపు వార్ కు రంగం క్రియేట్ చేసింది అని అంటున్నారు. బన్నీ వాస్ మహేష్ సినిమాతో అల్లు అర్జున్ సినిమా పోటీ పడదు అని ఇప్పటి వరకు చెపుతూ వచ్చి, ఇప్పుడు ‘నాపేరు సూర్య’ డేట్ ను అనౌన్స్ చేయడం మహేష్ బాబుకు నచ్చలేదు అని తెలుస్తోంది. దీనికితోడు బన్నీ వాస్ రెచ్చ గొట్టే విధానంలో వెళుతున్నాడని మహేష్ ఫీల్ అవుతున్నట్లు టాక్. దీనితో మనం ఎందుకు వెనక్కు తగ్గాలి మన సినిమాకు కూడ డేట్ ను అనౌన్స్ చేయాలి అంటూ పట్టుపట్టి మహేష్ ‘భరత్ అనే నేను’ నిర్మాతల చేత దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. ఏమైనా మహేష్ బన్నీల ఇగో వార్ సుమారు 300 కోట్ల బిజినెస్ ను ప్రభావితం చేస్తుంది కాబట్టి దీని పరిష్కారాల కోసం ఇంకా ఇరు వర్గాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయని టాక్..  



మరింత సమాచారం తెలుసుకోండి: