అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చే నెల నుండి సెట్స్ పైకి రాబోతున్న జూనియర్ ఎన్టీఆర్ మూవీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్ లేటెస్ట్ గా ప్రచారంలోకి వచ్చింది. ఒక భారీ ఫెయిల్యూర్ అందుకున్న తరువాత ఎవరైనా దర్శకుడు జూనియర్ తో సినిమాలు చేస్తే అది వెంటనే సూపర్ హిట్ అవుతుంది అన్న సెంటిమెంట్ ను తెరపైకి తీసుకు వస్తున్నారు.
JUNIOR NTR LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనికి ఉదాహరణగా సుకుమార్ ‘వన్ నేనొక్కడినే’ ఫెయిల్యూర్ తరువాత తీసిన ‘నాన్నకు ప్రేమతో’ ఫెయిల్యూర్ ల మధ్య పూరి జూనియర్ తో తీసిన ‘టెంపర్’ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫెయిల్యూర్ తరువాత దర్శకుడు బాబి జూనియర్ తో తీసిన ‘జై లవ కుశ’ సక్సస్ లను ఉదాహరణగా చూపెడుతున్నారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ రిపీట్ అయి భారీ ఫెయిల్యూర్ తరువాత త్రివిక్రమ్ జూనియర్ తో తీయబోతున్న మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ఈసినిమా మొదలు కాకుండానే అంచనాలు పెంచేస్తున్నారు. 
JUNIOR NTR LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఇది ఇలా ఉండగా ఈసినిమాకు పని చేస్తున్న రైటర్స్ టీమ్ విషయంలో త్రివిక్రమ్ చాలామంది కొత్త వారిని తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా త్రివిక్రమ్ ఒకటికి పది సార్లు ఈ మూవీ స్క్రిప్ట్ విషయమై తన రైటర్స్ టీమ్ తో చాల లోతైన చర్చలు తనకు సెంటిమెంట్ గా కలిసి వచ్చిన హైదరాబాద్ లోని కృష్ణానగర్ తన పాత రూమ్ లో కూర్చుని త్రివిక్రమ్ తన పాత సెంటిమెంట్ ను కూడ బయట పెడుతున్నట్లు సమాచారం.
JUNIOR NTR LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే ఈసినిమాకు సంబంధించి ఎవరూ ఊహించని విధంగా సంగీత దర్శకుడు థమన్ కు త్రివిక్రమ్ ఓటు వేయడం వెనుక పెద్ద కథ నడిచింది అని టాక్. వాస్తవానికి జూనియర్ ఈసినిమా సంగీత దర్శకుడుగా దేవిశ్రీ పేరును పైకి తీసుకు వస్తే మధ్య మార్గంగా త్రివిక్రమ్ వ్యూహాత్మకంగా తమన్ పేరు బయట పెట్టి దేవిశ్రీకి ఊహించని విధంగా చెక్ పెట్టాడు అని అంటున్నారు. ఒక భారీ ఫెయిల్యూర్ తరువాత త్రివిక్రమ్ జూనియర్ తో తీస్తున్న సినిమా కాబట్టి అన్ని సెంటిమెంట్లు ఉండేలా అన్ని జాగ్రత్తలు త్రివిక్రమ్ తీసుకుంటున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: