ఇలియానా అంటే ముందుగా గుర్తొచ్చేది ఆ సన్నటి నడుమే.. ఇది ఎవరైనా చెబుతారు. ఆమెకు హీరోయిన్లందిరిలోనూ ప్రత్యేకత తీసుకొచ్చింది ఆ ఫీచరే. అందులోనూ ఎన్ని సినిమాలు చేసినా.. ఎన్నేళ్లు గడిచినా ఆ సన్నని నడుమును అలాగే మెయింటైన్ చేసిందీ గోవా సుందరి. అందుకే ప్రతి డైరెక్టర్ ఇలియానా నడుమును హైలెట్ చేసేలా సీన్లు రాసుకునేవారు. 

ILEANA WAIST కోసం చిత్ర ఫలితం
చివరకు ఇలియానా నడుముపై సినిమాల్లో పాటలు కూడా వచ్చేశాయి. ఆ నడుముకు అంత క్రేజ్ ఉంది. కానీ ఇదంతా ఇలియానాకు చాలా చిరాకుగా ఉండేదట. ఈ విషయం ఇటీవల తానే బయటపెట్టింది. ఆమె ఇటీవల రాజ్ కుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ సరసన ‘రెయిడ్’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలు ఇచ్చింది. 

ILEANA WAIST కోసం చిత్ర ఫలితం
ఈ ఇంటర్వ్యూలోనే తన నడుము కష్టాలు చెప్పుకొచ్చింది. తాను  టాలీవుడ్‌లో మొదటిసారి సెట్స్‌పైకి వచ్చినపుడు నడుముపై శంఖం వేసి సన్నివేశాన్ని షూట్ చేశారట.. ఇలా చేస్తున్నారేంటి అని దర్శకుడిని అడిగిందట ఇలియానా.. నీ నడుము బాగుంది. ఈ సన్నివేశం షూట్ చేస్తే ఇంకా బాగుంటుందన్నారట డెరెక్టర్. ఇలా నడుముపై తెరకెక్కిస్తున్న ప్రతీ సన్నివేశంలో అదే మాట చెప్పేవారట.


నడుములో ఏం అందం ఉందో.. అలా సీన్లు తీయడంలో ఏం లాజిక్ ఉందో తనకు అర్థం కాలేదట. ఇలాంటి సన్నివేశాలు చేయడం ఇలియానాకు అస్సలు ఇష్టం ఉండదట. అలాంటి సీన్లు తీసేటప్పుడు...  ఆ షాట్ ఎప్పుడు పూర్తవుతుందా అనే ఆలోచిస్తుందట. అయితే బాలీవుడ్‌లో మాత్రం ఇలియానాకు ఇంకా ఇలాంటి ఘటనలు ఎదురుకాలేదట. ఇవీ ఇలియానా నడుము కష్టాలు. 



మరింత సమాచారం తెలుసుకోండి: