ఈ మద్య తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సైతం ప్రయోగాల వైపు మొగ్గు చూపుతున్నారు.  పాత్రకు తగ్గుట్టుగా తమ తమ గెటప్స్ మార్చుకోవడం..ఆ పాత్రల్లో లీనం కావడం కామన్ అయ్యింది.  ఇక భారతీయ చలన చిత్ర రంగంలో కమల్ హాసన్ లాంటి గొప్ప నటులు ఎన్నో రకాల ప్రయోగాలు చేసి విమర్శకుల చేత ప్రశంసలు పొందారు.  పొట్టిగా, పొడవుగా, అంద వికారంగా, లేడీ గెటప్ లో ఇలా ఎన్నో రకాల పాత్రల్లో నటించారు కమల్ హాసన్. ఇండస్ట్రీలో కమల్ తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన హీరో విక్రమ్ అనే చెప్పొచ్చు.
Image result for vijay sethupathi
  ‘ఐ’ చిత్రంలో విక్రమ్ చేసిన పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ఈ మద్య హీరోలు లేడీ గెటప్, హిజ్రాలుగా నటించి మెప్పిస్తున్నారు.  త‌మిళంలో విజ‌య్ సేతుప‌తికి చాలా క్రేజ్ ఉంది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా ఈ పేరు బాగా సుప‌రిచితం . మెగాస్టార్ 151వ చిత్రం సైరాతో విజ‌య్ సేతుప‌తి టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నాడు. విజ‌య్ సేతుప‌తి త‌మిళంలో ప‌లు చిత్రాల‌లో వెరైటీ ప్ర‌యోగాలు చేశాడు.  ప్రస్తుతం  సూప‌ర్ డీల‌క్స్ చిత్రంలో నటిస్తున్నాడు సేతుపతి. ఈ సినిమాలో లేడీ గెటప్ లో కనిపించబోతున్నాడు.
Image result for vijay sethupathi karishma
ఎర్ర చీరలో.. బొట్టుపెట్టుకుని సాంప్రదాయబద్ధంగా క‌నిపిస్తున్న విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో ట్రాన్స్‌జెండ‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు . ఈ పాత్ర పేరు శిల్ప కాగా, ఎక్కువ మేకప్ లేకుండా లేడీ గెటప్ లో ఈ మాస్ హీరో ఒదిగిపోయిన తీరు అందరినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది.  కరిష్మా అనే పేరుతో ఈ సినిమాలో కనిపించనున్న ఉన్ని పోస్టర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: