ప్రియా ప్రకాష్ వారియర్... ఓర చూపులతోనే కుర్రాళ్లను ఫిదా చేసిన మలయాళ అమ్మడు. ఆమె చేసిన మాణిక్య మలయార పూవి పాట ఎంత హిట్టయ్యిందో... అన్ని వివాదాల్లో చిక్కుకుంది. ముస్లింల మనో భావాలను దెబ్బ తీశారంటూ ఫిర్యాదులు రావడంతో కేసు కూడా నమోదయ్యింది. ప్రియా ప్రకాష్ వారియర్, డైరెక్టర్‌పై తెలంగాణతో పాటూ మహారాష్ట్రలో ముస్లిం సంఘాలు మండిపడ్డాయి. మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా పాట ఉందని ఆరోపించారు. మాణిక్య మలయార పూవి పాట తమ మనో భావాలను దెబ్బ తీసేలా ఉన్నాయని... పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Image result for ప్రియా ప్రకాశ్ వారియర్
హైదరాబాద్ పాతబస్తీలో కూడా కేసు నమోదయ్యింది. ఈ కేసుల నుంచి బయటపడేందుకు ముందుగానే స్టే కోసం కోర్టులో పిటిషన్ వేసింది.  తన పిటిషన్‌పై విచారణ చేపట్టాలని ఆమె కోరింది.   చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించే అవకాశం ఉందని ప్రియా ప్రకాశ్ ఆశిస్తోంది.  సినిమాకు ఎటువంటి నష్టం కలగకుండా ఈ కేసులు త్వరగా పరిష్కారం కావాలని ఆమె ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నిరోజుల కిందట దేశవ్యాప్తంగా మీడియాలో ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రధానాకర్షణగా నిలిచింది.
Image result for ప్రియా ప్రకాశ్ వారియర్
ఇందుకు కారణంగా ‘ఒరు ఆదార్‌ లవ్‌’ మూవీ 'మాణిక్య మలరాయ పూవి' పాటలోని సన్నివేశాలు. హీరోయిన్‌ కనుబొమ్మలను ఎగరేయడం, కన్ను కొడుతూ హీరోకు బదులిస్తున్న వీడియో సంచలనంగా మారింది. దీంతో మూవీ యూనిట్‌కు కష్టాలు కొని తెచ్చుకున్నట్లయింది. ఈ సినిమా మార్చి 3న విడుదల కాబోతుండగా.. మూవీ యూనిట్‌పై నమోదైన కేసుల నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదని నటి ప్రియా ప్రకాశ్ వారియర్. 


మరింత సమాచారం తెలుసుకోండి: