ప్రపంచ అందాళ్లలో ఒకరు..బాలీవుడ్ స్టార్ హీరో..హృతిక్ రోషన్ ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించారు.   సాధారణంగా స్టార్ హోదా వచ్చిన తర్వాత ఆ నటుడు సినిమాలు మినిమం గ్యారెంటీ అంటారు..అయితే తనకు మంచి స్టార్ ఇమేజ్ వచ్చినప్పటికీ ఏ సీన్ చేసినా నటనతో అందర్ని ఆకట్టుకోవాలి. కొత్తగా సినిమాల్లోకి వచ్చే వారైతే చాలా జాగ్రత్తలే తీసుకోవాలి అని ఆలోచిస్తారు హృతిక్ రోషన్.  బాలీవుడ్ లో మొదటి సారిగా అంతరిక్షానికి సంబంధించిన సినిమా తీసి మంచి విషయం అందుకున్నాడు.   

ఆ తర్వాత క్రిష్, క్రిష్ 2 లాంటి సినిమాలతో సూపర్ హీరో అనిపించుకున్నాడు. ప్రస్తుతం హృతిక్‌ సూపర్ 30 సినిమా కోసం హృతిక్ ఎన్నో కష్టాలు పడుతున్నాడు.  బాలీవుడ్‌లో హాలీవుడ్ తరహా అందగాడు అనగానే గుర్తొచ్చేది హృతిక్ రోషనే. ఆరడుగుల ఎత్తు, సిక్స్ ప్యాక్ శరీరమున్న అతనంటే పడిచచ్చే అమ్మాయిలకు లెక్కేలేదు. అతనంటే అంత పిచ్చి మరి.
Image result for హృతిక్ రోషన్
అలాంటి హ్యాండ్‌సమ్ ఒక్కసారిగా డీగ్లామర్‌గా కనిపిస్తే ఎలా ఉంటుంది? ఎవరి మాట ఎలా ఉన్నాసరే అతని ఫ్యాన్స్‌‌ మాత్రం కచ్చితంగా అవాక్కవుతారు. జైపూర్‌లోని కూడళ్లలో బుట్టలో అప్పడాలు వేసుకొని... సైకి‌ల్‌పై వీధి, వీధి తిరుగుతూ అమ్ముకున్నారట. ఆయన్ను కొంతమంది గుర్తించి వారి మొబైల్స్‌లో రికార్డు చేసినట్లు తెలుస్తోంది.

ఆ ఫోటోలు, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమా విష‌యంలో హృతిక్ డెడికేష‌న్ చూసి టీం షాక్‌కి గురైంద‌ట‌. ఈ చిత్రంతో హృతిక్ చాలా మందికి ఇన్‌స్పైరింగ్‌గా మార‌తాడు అని టీం అంటుంది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: