తెలుగు ఇండస్ట్రీలో కెరీర్ బిగినింగ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత ఫ్యామిలీ హీరోగా మారారు శ్రీకాంత్.  కొంత కాలంగా క్యారెక్టర్ పాత్రలో కనిపిస్తున్న శ్రీకాంత్ ‘యుద్దం శరణం’ చిత్రంలో విలన్ గా కనిపించాడు.   అప్పుడప్పుడు హీరోగా కొన్ని సినిమాలు తీస్తున్నారు. శ్రీకాంత్ , నాజియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'రా రా'. శ్రీమిత్ర చౌదరి సమర్పణలో విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 23న విడుద‌ల‌వుతుంది. సాధారణంగా సినిమా పోస్టర్లు అనగానే..ముందుగా దర్శకుల పేర్లు బాగా ఎక్స్ పోజ్ అవుతుంటాయి..అంతే కాదు కొంత మంది డైరెక్టర్లు ఏకంగా తమ ఫోటోలే పెట్టుకుంటారు. 
 సినిమా ఆగిపోయే పరిస్థితి వచ్చింది
అలాంటిది.. 'రా రా'  పోస్టర్ల మీద అసలు డైరెక్టర్ పేరే లేదు. మరి ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించారు? అనేది తెలియడం లేదు. ఇదే విషయం శ్రీకాంత్‌ను అడిగితే భలే ట్విస్ట్ ఇచ్చాడు.  సినిమా ప్రమోషన్ బాగా చేస్తున్నారని..అయితే ఈ మద్య రిలీజ్ అయిన పోస్టర్లలో డైరెక్టర్ పేరు మాత్రం కనిపించడం లేదు..దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. 
 సినిమాకు ఎవరు దర్శకత్వం వహించారు?
‘రా..రా' సినిమా పోస్టర్ల మీద డైరెక్టర్ పేరు లేదు, మీకు దర్శకుడికి ఏమైనా గొడవలు ఉన్నాయా? అని మీడియా వారు ప్రశ్నించగా అబ్బే అలాంది ఏమీ లేదని..కాకపోతే దర్శకుడికి నిర్మాతతో ఉన్నాయని అందుకే పేరు వేయలేదేమో అన్నారు. అంతే కాదు ఈ సినిమాకు చిత్ర యూనిట్ మొత్తం దర్శకత్వం చేశారని..ముఖ్యంగా యూనిట్లో ఓ అద్భుతమైన డైరెక్టర్ ఉన్నాడని..తనే మంచి డైరెక్షన్ చేశాడని అన్నారు.
 సినిమా పోస్టర్ల మీద డైరెక్టర్ పేరు లేదేంటి?
కాకపోతే ఆ డైరెక్టర్ ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు. సినిమా విడుదల తర్వాత ఆయన ఒప్పుకుంటే తప్పకుండా డైరెక్ట్ చేసిన వ్యక్తి పేరు చెబుతాం..... అప్పటి వరకు సస్పెన్స్ అంటూ శ్రీకాంత్ మాట దాటవేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: