సాధారణంగా భూమిపై మనిషిని పోలిన మనుషులు ఉంటారని అంటారు. అయితే ఇది సినిమాల్లో కనిపిస్తుంది..కానీ నిజజీవితంలో మనుషులు పోలిన మనుషులు కనిపంచడం చాలా అరుదు.  కాకపోతే కవల పిల్లలు కొంత మంది అచ్చుగుద్దినట్లు ఉండటం చూస్తుంటాం.  తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పుడు బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతుంది.    'క్వాంటికో' సిరీస్ తో ఆమె ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. 

గత కొంత కాలంగా ప్రియాంక చోప్రా పలు వివాదాల్లో మునిగిపోయింది.  సోషల్ మీడియాలో ఈ అమ్మడిపై కొన్ని సందర్భాల్లో నెటిజన్లు సీరియస్ కూడా అయ్యారు.  అంతే కాదు అస్సామ్ అసెంబ్లీలో ప్రియాంక ధరించిన డ్రెస్ పై కూడా పెద్ద వివాదం చెలరేగింది.  తాజాగా ప్రియాంక చోప్రా కి డూప్లికేట్ అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Image result for priyanka chopra
మేఘాన్ మిలాన్ అనే మోడల్ ప్రియాంక మాదిరే ఉండటంతో... నెటిజన్లు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇద్దరూ ఒకేలా ఉన్నారంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.పాకిస్థాన్ కు చెందిన మేఘాన్ కు కూడా మోడల్ గా మంచి గుర్తింపే ఉంది. ట్విట్టర్ లో ఆమెను 14 వేల మంది, ఇన్స్ టాగ్రామ్ లో 66 వేల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఆమె షేర్ చేసిన ఫొటోల్లో కొన్ని అచ్చం ప్రియాంకలా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: