ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రతి చిన్న విషయాన్ని వైరల్ గా చేస్తూ పాపులర్ కావాలని చూస్తున్నారు.  కొంత మంది పాజిటీవ్ గా చేస్తుంటే..మరికొంత మంది నెగిటీవ్ గా చేస్తున్నారు.  దారుణమైన విషయం ఏంటంటే..కొంతమంది ముర్ఖులు తాము ఘోరమైన తప్పులు (కొట్టడం, హింసించడం, అత్యాచారాలు, లైంగిక వేధింపులు) లాంటివి చేస్తూ దాన్ని వీడియో, సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు.  మాత్వం లేని కొందరు మనుషులు.. మతిస్థిమితం లేని వ్యక్తిని కట్టేసి సెల్ఫీలు దిగారు.
మతిస్థిమితం లేని వ్యక్తిని కట్టేసి సెల్ఫీలు
ఆ వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతున్నాడని చితకబాది.. కొన్ని గంటలపాటు హింసించారు. గ్రామ సమీపంలో ఉన్న దుకాణాల్లో ఆ వ్యక్తి దొంగతనాలు చేస్తున్నాడన్న నెపంతో.. అతడిని స్థానికులు కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఈ సమయంలో కొందరు యువకులు సెల్ఫీలు తీసుకున్నారు. మతిస్థిమితం కోల్పోయిన బాధితుడిని కొన్ని గంటల పాటు హింసించారు.

పోలీసులు అక్కడికి చేరుకొని.. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.  తాజాగా దీనిపై స్పందించిన మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ఆవేదన వ్యక్తం చేశారు.‘‘అతను ఆదివాసి కాదు. నా సోదరుడు లాంటి వాడు. దుండగులు నా సోదరుడిని చంపేశారు. మనిషిగా ఆలోచిస్తే చనిపోయిన మధు మీకో సోదరుడిగా, కుమారుడిగా కన్పిస్తాడు.

ఇంకా చెప్పాలంటే అతను మనలాగే పౌరుడు. అతనికీ హక్కులు ఉంటాయి. ఆకలి కోసం దొంగతనం చేసేవారిపై దొంగ అనే ముద్రవేయకూడదు. పేదరికాన్ని సమాజమే సృష్టించింది. కారణం ఏదైనా ఓ మనిషి మరో మనిషిపై దాడి చేయడం తప్పు. క్షమించు మధు" అంటూ మమ్ముట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: