సుమారు 250 కి పైగా సినిమాలలో నటించి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్ గా ఎంతో ఖ్యాతి పొందిన శ్రీదేవి జీవితంలో కనిపించే వెలుగు మెరుపుల వెనుక చాలామందికి తెలియని అశాంతి ఉందని ఆమె సన్నిహితులు అంటూ ఉంటారు. అతిలోకసుందరిగా ఇండస్ట్రీని శాసించిన ఆమె జీవతం మొత్తం అశాంతి మధ్యనే నలిగిపోయింది అన్న ప్రచారం కూడ ఉంది.
శ్రీదేవి మరణాన్ని పరిశీలిస్తే
బాలనటిగా చిన్నప్పటి నుంచి ఆమె కెరియర్ ప్రారంభించి టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగినా ఆమె రేంజ్ కి తగ్గ ఆస్థులు ఆమె పొందలేకపోయింది అన్న విశ్లేషణలు కూడ ఉన్నాయి. చాలాకాలం క్రితం మీడియాలో సందడి చేసిన వార్తల ప్రకారం శ్రీదేవి టాప్ హీరోయిన్ గా గణించిన ఆస్థులు ఎంతవరకు మిగిలాయి అన్నది ప్రశ్నార్థకం అన్న గాసిప్పులు కూడ ఉన్నాయి. 
తిరిగి రాని లోకాలకు
దీనికితోడు శ్రీదేవి సోదరితో ఏర్పడిన అభిప్రాయభేదాలు వల్ల శ్రీదేవి ఆస్థుల పరంగా గతంలో చాల నష్టపోయింది అన్న గాసిప్పులు కూడ వినిపించాయి. శ్రీదేవి ఒక టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో అందరికీ షాక్ ఇస్తూ ఆమె కంటే వయస్సులో చాల పెద్దవాడైన బోనీ కపూర్ ను పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇవ్వడమే కాకుండా ఆ పెళ్లి తరువాత బోనీ కపూర్ తీసిన చాల సినిమాలు ఫెయిల్ అవ్వడంతో ఆర్ధికంగా శ్రీదేవి నష్ట పోయింది అన్న ప్రచారం కూడ అప్పట్లో బాలీవుడ్ మీడియాలో విపరీతంగా జరిగింది. 
శ్రీదేవి మృతిపై యూఏఈ అంబాసిడర్
అంతేకాకుండా కూతురిని హీరోయిన్ చేయాలని అనుకున్న తరువాత శ్రీదేవి కూతురు జాన్వి పై జరిగిన నెగిటివ్ ప్రచారం కూడ శ్రీదేవి మనసును బాగా గాయపరిచింది అంటారు. దీనితో కెరియర్ పరంగా ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కొనే విషయంలో వరస విజయాలు వస్తున్నా ఏరోజు పూర్తిగా  ఆనందం లేని జీవితాన్ని శ్రీదేవి గడిపింది అని కూడ కొందరు అంటారు. అయితే ఎన్ని సమస్యలు ఎదురైనా మహిళా సాధికారతకు నిదర్శనంగా శ్రీదేవి చేసిన ఒంటరి పోరాటం భారతీయ సినిమారంగ చరిత్రలో ఆమెకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని సొంతం చేసుకోగలిగింది అన్నది వాస్తవం..  


మరింత సమాచారం తెలుసుకోండి: