కాజల్.. ఈ మిల్కీ వైట్ హీరోయిన్ తెలుగులో టాప్ హీరోయిన్లలో ఒకరు. తెలుగులో అందరు టాప్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ సాధారణంగా గ్లామర్ పాత్రలకే పరిమితం అయ్యారు. గ్లామర్ హీరోయిన్ అనే బిరుదు ఏ హీరోయిన్ కైనా కిక్ ఇచ్చేదే.. అయితే కొన్నాళ్ల తర్వాత ఆ బిరుదు బోర్ కొట్టేస్తుంది. వచ్చిన పేరు చాలు అనిపిస్తుంది. 

సంబంధిత చిత్రం
అప్పుడు హీరోయిన్లలోని అసలు నటి తనలోని సత్తా చూపించేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పుడు కాజల్ విషయంలోనూ అదే జరుగుతోంది. అందుకే కాజల్ లోని నటి తాజాగా అ సినిమాతో తన దాహం తీర్చుకుంది. ఈ సినిమా సక్సస్ తనకెంతో ఆనందాన్నిస్తోందంటోంది కాజల్. అ, అర్జున్ రెడ్డి వంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ లో పని చేయడం తనకు చాలా ఇష్టం అంటోంది. 

సంబంధిత చిత్రం
అ సినిమా సక్సస్, తన రోల్ కు వచ్చిన రెస్పాన్స్ ఓ వైపు ఆనందపరుస్తోంది. అలాగే పర్సనల్ లైఫ్ లోనూ మరో సంతోషం ఆమెకు దక్కింది. ఆమె సోదరి నిషా ఓ బిడ్డకు  జన్మనిచ్చింది. ఈ రెండో విషయం సంతోషంగానే ఉన్నా.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పెట్టే కామెంట్లు కాస్త ఇబ్బంది పెడుతున్నాయట ఈ ముద్దు గుమ్మను.. కొందరు ఆంటీ అంటూ పలకరించడంతో ఈ తెల్ల తోలు పిల్ల ముఖం కోపంతో కందగడ్డలా మారిపోతోందట. 



మరింత సమాచారం తెలుసుకోండి: