అతిలోకసుందరిగా కోట్లాదిమంది అభిమానులను అభిమానాన్ని పొందిన శ్రీదేవి మరణం వెనుక అనేక సమాధానాలు లేని ప్రశ్నలు దాగి ఉన్నాయి అని ఒక ప్రముఖ తెలుగు దిన పత్రిక ఈరోజు ఒక ఆసక్తికర కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. క్లిష్టమైన పరిస్థుతులలో కూడ తన భావోద్వేగాలను బయట పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం శ్రీదేవి అలవాటు అని ఆ అలవాటు ఆమెలో మానసిక ఒత్తిడిని పెంచి ఆమెను ఈ లోకం నుంచి దూరం చేసింది అన్న అభిప్రాయాలను ఆ పత్రిక వ్యక్తం చేసింది.
ఆలస్యం ఎందుకు
దీనికితోడు ఫిబ్రవరి 20న దుబాయ్ లో శ్రీదేవి కుటుంబ సభ్యుల ఇంట్లో జరిగిన వివాహ వేడుకలు ముగిసాక కూడ ఆమె దుబాయ్ లోని ఒక ప్రముఖ హోటల్ లో ఉండిపోవడం రెండు రోజుల పాటు ఆమె హోటల్ గది నుంచి బయటకు రాకపోవడం వెనుక సమాధానంలేని ప్రశ్నలు ఉన్నాయి అంటూ ఆ ప్రముఖ దినపత్రిక తన అనుమానాలను వ్యక్త పరిచింది.
దుబాయ్‌లో ఏం జరుగుతోంది
దీనికితోడు తాను ఎన్నో కలలు కంటున్న తన కూతురు జాన్వి మొదటి చిత్రం ఫలితం ఎలా ఉంటుందో అన్న స్ట్రెస్ కూడ ఆమెను రోజురోజుకు మానసికంగా తీవ్ర బలహీనతకు లోనై ఉంటుంది అన్న అనుమానాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా ఆమె లేటెస్ట్ గా నటించన ‘మామ్’ మూవీ ఆర్ధికంగా పెద్దగా చెప్పుకోతగ్గ విజయాన్ని సాధించకపోవడం ఆమె బెంగకు మరోకారణం అన్న మాటలు కూడ వస్తున్నాయి.
అంబానీ రంగంలోకి దిగారు
దీనితో శ్రీదేవి అంత్యక్రియలు ముగిశాక ఆమె మరణానికో లేదా అనారోగ్యానికో సంబంధించిన కథనాలు బయటకు రావచ్చు అన్న సందేహాలను ఆ ప్రముఖ పత్రిక వ్యక్త పరుస్తోంది. దీనికితోడు  పాప్‌ సింగర్‌ మైకేల్‌ జాక్సన్‌ వీరాభిమాని అయిన శ్రీదేవి తన మరణంలో కూడ మైకేల్ జాక్సన్ లాగే హార్ట్ ఎటాక్ తో చనిపోవడం యాదృచ్ఛికం అని అంటున్నారు. ఈ ఇద్దరూ తమ అందాన్ని కాపాడుకోవడానికి సర్జరీలు చేయించుకున్నట్లగానే చిన్న వయసులోనే మృత్యువు ఒడిలోకి చేరడంలో మైకేల్‌ జాక్సన్‌, శ్రీదేవి మధ్య చాలా పోలికలున్నాయి. పుట్టినరోజు అంటే అసహ్యం వ్యక్త పరిచే శ్రీదేవి తాను జీవితంలో ఎప్పుడు తన పుట్టినరోజును ఎప్పుడు ఆనందంగా జరుపుకోలేదని ఆమె సన్నిహితులు అంటూ ఉంటారు. ఏమైనా అతి తక్కువగా మాట్లాడే శ్రీదేవి మరణం వెనుక కూడ ఎన్నో సమాధానం దొరకని ప్రశ్నలు ఉండటం అందరికీ షాక్ ఇచ్చే విషయం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: