ఈమధ్య కాలంలో అల్లు అర్జున్ వ్యవహార శైలి పై నెగిటివ్ ప్రచారం జరగడం సర్వసాధారణమైన విషయంగా మారింది. ఇలాంటి వార్తలు బన్నీ పై రావడానికి అల్లు అర్జున్ మితిమీరిన ఆత్మవిశ్వాసం కూడ ఒక కారణం అంటూ కొందరు ఇప్పటికే బన్నీ వ్యవహార శైలి పై కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో అల్లు అర్జున్ తన లేటెస్ట్ మూవీ ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ మూవీ ప్రమోషన్ విషయంలో అనుసరిస్తున్న కొత్త పోకడల పై సెటైర్లు పడుతున్నాయి. 
ALLUARJUN IN NAAPERU SURYA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
సాధారణంగా ఒక కొత్త సినిమాకు సంబంధించి ముందుగా ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తారు. ఆ తర్వాత టీజర్ బయటికి వస్తుంది. ఇది ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయం. అయితే అల్లు అర్జున్ టీమ్ మాత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ విషయంలో దీనికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఈ చిత్ర టీజర్ రెండు నెలల కిందటే నూతన సంవత్సర కానుకగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ ఏమీ లేకుండా నేరుగా ‘ఫస్ట్ ఇంపాక్ట్’ పేరుతో టీజర్ ను ముందుగా రిలీజ్ చేశారు. 
ALLUARJUN IN NAAPERU SURYA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈమూవీలోని బన్నీ లుక్స్ ఆల్రెడీ బయటికి వచ్చేశాయి. కాబట్టి ఇక ప్రత్యేకంగా ఫస్ట్ లుక్ ఏమీ ఉండదు అని అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు ఈసినిమాకు సంబంధించి ‘పోస్టర్ ఇంపాక్ట్’ పేరుతో ఫస్ట్ లుక్ లాంచ్ చేయబోతున్నారు. రేపు మార్చి 1న ఈ పోస్టర్ ఇంపాక్ట్ లాంచ్ చేయబోతున్నారు. దీనిగురించి బన్నీ పీ ఆర్ టీమ్ ఊదరగొడుతూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టేసింది. బన్నీ నెవర్ బిఫోర్ అవతార్‌లో కనిపించబోతున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. 
ALLUARJUN IN NAAPERU SURYA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
కానీ వాస్తవానికి బన్నీ లుక్ ఏంటన్న దానిపై ఇప్పటికే క్లారిటీ ఉంది. ఇప్పటికే విడుదలైన ఈమూవీ టీజర్ లో బన్నీ ఒకే లుక్‌ లో కనిపించాడు. దీనితో కొత్తగా మళ్ళీ అల్లు అర్జున్ కొత్త లుక్ ను ఏమి చూపెడతారు అని సెటైర్లు పడుతున్నాయి. ఇప్పటికే మహేష్ ‘భరత్ అనే నేను’ మూవీతో సంధి చేసుకుని ఈమూవీని మే 4న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న నేపధ్యంలో ఈమూవీ పై ప్రస్తుతం జరుగుతున్న నెగిటివ్ ప్రచారం ఎంత వరకు హాని చేస్తుందో అని ఈమూవీని అత్యంత భారీ రేట్లకు కొనుక్కున్న బయ్యర్లు భయపడుతున్నట్లు టాక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: