భారతదేశం చలన చిత్రం రగంలో ఎంతో మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు..కానీ అతి కొద్ది మంది మాత్రమే చిరస్థాయిగా గుర్తుండిపోయే హీరోలు అయ్యారు.   ఇక హిందీ, తెలుగు,తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా వెలిగిపోతున్న రజినీకాంత్ అరవైలో కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతు నటిస్తున్నారు. గత సంవత్సరం కబాలి లాంటి సెన్సేషన్ హిట్ చిత్రంలో నటించిన రజినీ అదే దర్శకుడితో 'కాలా' చిత్రంలో నటిస్తున్నారు.  కోట్లాది అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న  రజనీకాంత్ ‘కాలా' తెలుగు టీజర్ కూడా వచ్చేసింది. 

 "కాలా అంటే ఎవరు? కాలుడు... కరికాలుడు..గొడవపడైనా సరే కాపాడేవాడు" అన్న బ్యాక్ గ్రౌండ్ వాయిస్ డైలాగుతో పాటు ఓ మధ్యతరగతి కుటుంబ గృహిణి "గొడవేకదా? పెట్టుకుంటాడు పెట్టుకుంటాడు. ఎన్నాళ్లు ఎట్టుకుంటాడో నేనూ చూస్తా" అని వ్యంగ్యంగా అనే మాటలతో రజనీ తన స్టైల్ చూపించారు.

ఇక నానాపటేకర్ డైలాగులతో పాటు "నలుపు... శ్రమ జీవుల వర్ణం. మా వాడకొచ్చి చూడు. మురికంతా ఇంధ్రదనస్సులా కనిపిస్తుంది",  "క్యారే... సెట్టింగా? వీరయ్య బిడ్డనురా... ఒక్కడినే ఉన్నా... దిల్లుంటే గుంపుగా రండిరా" అన్న రజనీ డైలాగ్ ఈ టీజర్ లో ఉన్నాయి. చివరిగా "ఈ కరికాలుడి పూర్తి రౌడీయిజాన్ని చూడలేదు కదూ.

ఇప్పుడు చూపిస్తా" అన్న డైలాగ్ తో టీజర్ ముగుస్తుంది.  ఈ సినిమాలో  పవర్ ఫుల్ డైలాగ్స్ చూస్తుంటే..అభిమానులు ఎంతో ఉత్సాహ పడుతున్నారు.  మళ్లీ రజినీకాంత్ ని భాషా, నరసింహా, సింహాచలం లాంటి సినిమాలు గుర్తుకు వస్తున్నాయని తెల సంతోష పడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: