ఈ మద్య భారతీయ చలన చిత్రాల్లో అద్భుతమైన టెక్నాలజీ ఉపయోగించి హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.  ఇప్పటికే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఫ్యూజువల్ ఎఫెక్ట్స్ తో దుమ్మురేపిన విషయం తెలిసిందే. బాహుబలి 2 భారత దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో తెలుగోడి సత్తా ఏంటో చూపించింది.  ఆ మద్య శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన ‘రోబో’ కూడా అద్భువిజయం సాధించింది. అప్పట్లో ఈ చిత్రంలో ని గ్రాఫిక్స్ కి ప్రేక్షకులు మంత్ర ముగ్ధులు అయ్యారు. 
2.0 స్పెషల్ ఎఫెక్ట్స్.. ఇదే మేకింగ్ వీడియో
ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో రోబో 2.0 రాబోతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ చిత్రంలో ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కొన్ని టెక్నికల్స్ ఇబ్బందుల వల్ల విడుదల కాలేదు.  అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అని ప్రేక్షకులు కన్ఫ్యూజన్ లో పడ్డారు. ఇక దర్శకులు శంకర్  వారాలు నెలలు గడిచిపోతున్నాయో సినిమా ఎంతవరకు వచ్చిందో చెప్పడు. ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో చెప్పాడు. రిలీజ్ డేట్ లాక్ చేయడు. ఏమన్నా అంటే గ్రాఫిక్స్ అవట్లేదనే మాట మాత్రం చెబుతున్నారు.

ఎంత గ్రాఫిక్స్ అయినా మరీ ఇంత లేటా..’’ కోలీవుడ్ అండ్ టాలీవుడ్ లో చాలా రోజులుగా వినిపిస్తుంది. తాజాగా వీటన్నింటికి చెక్ పెడుతూ..తాజాగా 2.0 విఎఫ్ ఎక్స్ మేకింగ్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఇందులో డైరెక్టర్ శంకర్.. విలన్ గా చేస్తున్న బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్.. టెక్నికల్ టీంలోని ముఖ్యమైన వాళ్లు.. గ్రాఫిక్స్ చేస్తున్న థర్డ్ ఫ్లోర్ కంపెనీలోని నిపుణులు ఈ సినిమాను ఎంత రిచ్ గా తెరకెక్కిస్తున్నారో చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఏం రేంజిలో ఉంటాయో.. యాక్షన్ సీన్స్.. గ్రీన్ మాట్ లో తీసే సీన్స్ ఎలా ఉంటాయి? ఇందుకోసం ఎలాంటి టెక్నాలజీ వాడుతున్నారు ఇలా అన్ని వివరాలు చెప్పుకొచ్చారు.  సినిమాలో గ్రాఫిక్స్ చూసి.. అబ్బా అద్భుతం అనుకోకూడదు. అది కథలో భాగమే అనుకోవాలి. అది నిజమేనని ఫీలవ్వాలి.’’ అంటూ శంకర్ ఓ మాట చెప్పాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: