తెలుగు ఇండస్ట్రీలో ఈశ్వర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ప్రముఖ దర్శకులు రాజమౌళి తెరకెక్కించిన ‘చత్రపతి’తో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు.  ఆ తర్వాత వచ్చిన డార్లింగ్, మిర్చి చిత్రాలతో మంచి విజయం అందుకున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’, ‘బాహుబలి2’ చిత్రాలు ప్రపంచ స్థాయిలో దుమ్మురేపాయి. 
Related image
భారత దేశంలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా రికార్డులు నెలకొల్పింది.  బాహుబలి 2 తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’ చిత్రంలో నటిస్తున్నాడు.  ఈ చిత్రానికి సంబంధించి ఒక్క ఫస్ట్ లుక్ తప్ప ఎలాంటి అప్ డేట్స్ కాలేదు. అయితే సాహూ చిత్రం మాత్రం జాతీయ స్థాయిలో మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు చిత్ర యూనిట్.  పలువురు బాలీవుడ్ స్టార్స్ నటిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి .
Image result for mandira bedi hot
ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది.  1990 ప్రాంతంలో పాపులర్ టీవీ సీరియల్ ” శాంతి ” లోను, అనంతరం.. క్యో కీ సాంస్ భీ బహూ థీ వంటి సీరియల్స్ లో నటించిన మందిరాబేడీ అంటే తెలియని వారు ఉండరు.  ఈ అమ్మడు సీరియల్స్ తర్వాత బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. “దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే “, ” బాదల్ “, ” గాడ్ మదర్ “, ” దస్ కహానియా ” వంటి చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. అప్పుడప్పుడు తన హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది.
Image result for mandira bedi hot
అంతే కాదు ఆ మద్య స్టయిలిష్ క్రికెట్ షో ప్రెజంటర్ గాను ఈ భామ వార్తల్లో నిలిచింది. మందిరా బేడీని ఈ పాత్రకు మేకర్స్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ” రన్ రాజా రన్ ” ఫేం సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రద్ధా కపూర్ హీరోయిన్. జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, నీల్ నితిన్ ముకేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

Image result for mandira bedi hot


మరింత సమాచారం తెలుసుకోండి: