తెలుగు, తమిళ ఇండస్ట్రీలో కమల్ హాసన్ తర్వాత అంత గొప్ప స్థాయిలో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి మెప్పించాడు విక్రమ్. ఆ మద్య ‘ఐ’ సినిమాలో డీ గ్లామర్ గా కనిపిస్తూనే..అందగాడిగా నటించారు.  ఈ సినిమా తెలుగులో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక తెలుగు లో సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు.
రీమేక్ హక్కుల కోసం
గత ఏడాది అర్జున్ రెడ్డి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద చేసిన సందడి అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో జాతీయ వ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్ గా ఈ చిత్రం మారింది. బాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలు ఈ చిత్ర రీమేక్ హక్కుల కోసం ఎగబడ్డారు. ఇప్పడు అతడితో సినిమా చేయడానికి టాలీవడ్ పెద్ద స్టార్లు ఆసక్తి చూపిస్తున్నారు. అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ దేవర కొండా నటన ఆశ్చర్యపరిచింది.
Image result for vikram son dhruv
కాగా ఈ చిత్రాన్ని తమిళంలో స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.  మొదట ఈ చిత్రం ఎన్నో వివాదాలకు కేంద్ర బింధువుగా నిలిచింది. కానీ థియేటర్లో రిలీజ్ అయిన తర్వతా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దీనితో పలు భాషల నిర్మాతలంతా రీమేక్ హక్కుల కోసం ఎగబడ్డారు. తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. తమిళ దర్శకుడు బాల ఈ చిత్రానికి తెరకెక్కిస్తున్నారు.
Image result for vikram son dhruv
వర్మ అనే టైటిల్ తో ఈ చిత్రం రాబోతోంది.ధృవ్ డెబ్యూ మూవీ ఇదే.  విక్రమ్ తన కుమారుడు లేటెస్ట్ లుక్ ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. గడ్డం లుక్ లో ధృవ్ అబ్బురపరిచే విధంగా మారిపోయాడు.అర్జున్ రెడ్డి చిత్రం చూసాక తన కుమారుడిని లాంచ్ చేయడానికి ఇదే సరైన చిత్రం అని భావించానని విక్రమ్ తెలిపాడు.

 తండ్రి నమ్మకాన్ని నిలబెట్టేలా



మరింత సమాచారం తెలుసుకోండి: