ప్రతి హీరో మాస్ హీరోగా మారాలని కలలు కంటూ ఉంటాడు. మాస్ ఇమేజ్ లేకుండా ఒక హీరో ఎంత సమర్ధుడు అయినప్పటికీ ఎక్కువ కాలం కొనసాగడం కష్టం ఒక హీరోకి మాస్ ఇమేజ్ వస్తే కలక్షన్స్ పెరగడమే కాకుండా ఆ హీరో రేంజ్ విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి నేచురల్ స్టార్ నానీకి ఎదురైంది అన్న వార్తలు వస్తున్నాయి. 
NANI LATEST PHOTOS IN KRISHNARJUNA YUDDHAM కోసం చిత్ర ఫలితం
వరస విజయాలతో దూసుకుపోతున్న నానీ తన దూకుడును మరింత పెంచుతూ వేగంగా సినిమాలు చేయడమే కాకుండా తన పారితోషికాన్ని 9 కోట్ల స్థాయికి పెంచేసాడు. ఇప్పుడు ఆ రేంజ్ లో నాని నిలబడాలి అంటే అతడి సినిమాలకు ఖచ్చితంగా 50 కోట్లకు పైగా కలక్షన్స్ రావాలి. ఈ రేంజ్ ని అందుకోవాలి అంటే నాని సినిమాలకు మాస్ ఇమేజ్ బాగా పెరగాలి. 
NANI LATEST PHOTOS IN KRISHNARJUNA YUDDHAM కోసం చిత్ర ఫలితం
ఇప్పుడు ఈ లక్ష్యం సాధించడానికే నాని ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో చేయబోతున్నాడా అన్న అనుమానాలు లేటెస్ట్ గా విడుదలైన ఈమూవీ టీజర్ చూసిన వారు వ్యక్త పరుస్తున్నారు. అయితే యాక్షన్ హీరో ఇమేజ్ తెచ్చుకోవాలన్న కోరిక సమంజసమైనా ఆ కోరిక నానీకి ఎంత వరకు కలిసి వస్తుంది అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వాస్తవానికి మాస్ యాక్షన్ జోలికి వెళ్లిన ప్రతి యంగ్ హీరోకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. 
NANI LATEST PHOTOS IN KRISHNARJUNA YUDDHAM కోసం చిత్ర ఫలితం
నాగచైతన్య నితిన్ శర్వానంద్ లాంటి పేరున్న యంగ్ హీరోలు నటించిన మాస్ సినిమాలు అన్నీ ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి.  గతంలో నాని కూడా మాస్ హీరోగా మారడానికి ప్రయత్నించి నటించిన ‘పైసా’ ‘జెండాపై కపిరాజు’ లాంటి సినిమాలు ఘోరమైన ఫ్లాపులుగా మారాయి. దీనితో నాని తన రూట్ మార్చి ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు చేయడం మొదలు పెట్టిన తరువాత నాని రేంజ్ పెరిగింది. దీనితో మంచి ఇమేజ్ లో ఉన్న నాని అనవసరంగా తన మాస్ ఇమేజ్ కోసం ‘కృష్ణార్జున యుద్ధం’ లాంటి మాస్ మసాలా సినిమాలో తానే హీరో మరియు విలన్ గా నటిస్తూ చేస్తున్న ప్రయోగం ఎంత వరకు విజయవంతం అవుతుంది అన్న అనుమానాలు ఇండస్ట్రీ వర్గాలలో కొందరు వ్యక్త పరుస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: