టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్ సమ్ కపుల్ గా  పేరుగాంచిన చైతు సమంతల కాంబినేషన్ లో వచ్చిన 'ఏమాయ చేశావే' 'మనం' చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించాయి. ఈసినిమాలు కాకుండా వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో మరికొన్ని సినిమాలు వచ్చినా అవి బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాన్ని చూపెట్టలేక పోయాయి. వీరిద్దరి పెళ్లి తర్వాత వీరిద్దరూ వారివారి సినిమాలో బిజీగా ఉన్నావీరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తే బాగుటుంది అన్న అంచనాలు ఉన్నాయి. 
SAMANTHA ALONG WITH NAGACHAITANYA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
తెలుస్తున్న సమాచారం ప్రకారం వీరి కాంబినేషన్ లో త్వరలో ఒక సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్య సమంత జోడీగా త్వరలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తునాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఫిలిం నగర్ టాక్.  పెళ్లి తరువాత వీరి ద్దరు కలిసి చేస్తున్న తొలిసినిమా కాబట్టి రెమ్యూనరేషన్ విషయంలో చైతు సామ్ లు పెడుతున్న కండిషన్స్ ఈ సినిమా నిర్మాతకు చుక్కలు చుపెడుతున్నట్లు సమాచారం. 
SAMANTHA ALONG WITH NAGACHAITANYA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ప్రస్తుతం నాగ చైతన్యకు ఉన్న మార్కెట్ రీత్యా  ఒక్కో సినిమాకు 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అన్న వార్తలు ఉన్నాయి. సమంత కూడా తన సినిమాకు కోటిన్నర వరకు  వరకు తీసుకుంటోంది అన్న వార్తలు ఉన్నాయి. అయితే పెళ్లి తర్వాత  చైతు సమంతలు  చేస్తున్న సినిమా కావడంతో ప్రస్తుతం వీరిద్దరికీ ఉన్న క్రేజ్ రీత్యా 7 కోట్ల పారితోషికం కావాలని వీరిద్దరూ డిమాండ్ చేసినట్లు సమాచారం. టాలీవుడ్ లో మీడియం రేంజి హీరోలు కూడ 5 నుండి 7 కోట్ల వరకు తీసుకుంటున్నారు కాబట్టి ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతో క్రేజ్ ఉన్న తమ జంటకు  7 కోట్లు ఇవ్వడం ఈ సినిమాను నిర్మిస్తున్న నిర్మాతకు పెద్ద భారంకాదు అని చైతు సమంతలు వాదిస్తున్నట్లు సమాచారం. 
SAMANTHA ALONG WITH NAGACHAITANYA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనితో ఈ క్రేజి మూవీ ప్రాజెక్ట్ ను నిర్మిద్దాం అని ఆలోచనలు చేస్తున్న నిర్మాత ఈ ప్రాజెక్ట్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సమంత నటించిన ‘రంగస్థలం’ రిలీజ్ టాక్ వచ్చాక ఈ మూవీ ప్రాజెక్ట్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాసం ఉంది అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా నాగచైతన్య సమంతలు భాగ్యనగరంలోని ఒక ప్రముఖ హోటల్ లో రెడ్ వైన్ తెసుకుంటూ సేద రీరుతున్న ఫోటోను చైతన్య ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయడంతో ఆ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: