మహానటి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న మహానటి సినిమాలో కీలకంగా కనిపించబోయే ఎన్టీర్ ఎ.ఎన్.ఆర్ పాత్రలకు జూనియర్ ఎన్టీర్ నాగచైతన్యలను సంప్రదించిన విషయం తెలిసిందే. అయితే ఈవిషయంలో జూనియర్ నుంచి స్పందన రాకపోవడంతో మహానటి సినిమాలో జూనియర్ నాగచైతన్యలు నటించడం లేదు అని అనుకున్నారు అంతా. 
NAGA CHAITANYA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే వ్యూహాత్మకంగా చైతు యూటర్న్ తీసుకుని ఇప్పుడు ఈసినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటించడానికి అంగీకారం చెప్పడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. కీర్తి సురేశ్ సావిత్రిగా జమునగా సమంత జెమిని గణేషన్ గా దుల్కర్ సల్మాన్ ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు నాగిరెడ్డిగా ప్రకాష్ రాజ్ ఇలా అనేకమంది హేమాహేమీలు కీలక పాత్రలు పోషిస్తున్న ఈమూవీలో అన్ని పాత్రలకు ప్రముఖ నటీనటులు దొరికినా ఎన్టీఆర్ ఏ ఎన్ ఆర్ పాత్రల విషయంలోనే మొదట్నుంచి అయోమయం నెలకొంది. 
MAHANATI MOVIE POSTERS కోసం చిత్ర ఫలితం
దీనితో ఈమధ్య ఈమూవీలో ఎన్టీర్ ఏ  ఎన్ ఆర్ పాత్రలు లేకుండా నే ఈ సినిమాను పూర్తి చేస్తారు  అనే అనుమానాలు కుడా వ్యక్తం అయ్యాయి. అయితే ఇప్పుడు ఈమూవీలో తన తాత పాత్ర చేయడానికి చైతూ ఒప్పుకున్నాడని తెలుస్తోంది. కానీ ఎన్టీఆర్ పాత్ర చేయడానికి తారక్ నిరాకరించడంతో చైతూ కూడా ఒక దశలో ఏ ఎన్ ఆర్ పాత్ర చేయడానికి విముఖంగానే కనిపించాడు. ఎన్టీఆర్ సంగతి ఎలా ఉన్నప్పటికీ తాను ఏ ఎన్ ఆర్ పాత్రలో కనిపించడానికి చైతూ ఓకే చెప్పాడట. 
NAGA CHAITANYA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
తన పై తీసే సన్నివేశాల కోసం రెండురోజులు డేట్లు కూడా కేటాయించాడట. ఈ సీన్స్ ను ఈనెల మార్చ్15-16 తారీఖులలో చిత్రీక రించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా చైతన్య తన తాతలా కనిపించడానికి కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.  దీనితో  ఎన్టీఆర్ పాత్రను ఇంకెవరితో అయినా చేయిస్తారా లేదా ఇంతకుముందు అనుకున్నట్లుగా డిజిటల్ రూపంలో ఎన్టీఆర్ ను చూపిస్తారా అన్న విషయం తేలవలసి ఉంది అని అంటున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈమూవీని ఈవేసవి చివర్లో టాప్ హీరోల సినిమాల హడావిడి పూర్తి అయ్యాక విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: