తెలుగులో తక్కువ సినిమాలే చేసినా.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి ఇంద్రజ. యమలీల, అమ్మదొంగా, పెద్దన్నయ్య, సొగసు చూడతరమా వంటి హిట్ చిత్రాల్లో నటించినా ఎందుకో ఆమె కెరీర్ అంతగా ఊపందుకోలేదు. పెద్దన్నయ్య సినిమా అప్పట్లో హిట్ అయినా అవకాశాలు పెద్దగా రాలేదు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ శతమానం భవతి చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. 

Image result for BALAKRISHNA PEDDANNAYYA
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలు నెమరేసుకున్న ఇంద్రజ.. పెద్దన్నయ్య షూటింగ్ రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ ఆమెకు ఓ గిఫ్ట్ ఇచ్చారట. అది ఓ పెర్‌ఫ్యూమ్‌ బాటిల్‌.. అందులో విచిత్రం ఏముందనుకుంటున్నారా.. ఆ బాటిల్ ఓ సెక్సీ అమ్మాయి ఆకారంలో ఉందన్నట. అది చూసి ఇంద్రజ చాలా సిగ్గుపడిపోయిందట. 

Related image
పెద్దన్నయ్య నాటి మరికొన్ని విశేషాలు పంచుకుంది ఇంద్రజ.. పెద్దన్నయ్య’ చేస్తున్నప్పుడు అప్పటికే హీరోయిన్‌గా బాగా పేరు వచ్చింది.. బాలకృష్ణగారి పెద్ద స్టార్‌తో చేయడం అదే ఫస్ట్‌ టైమ్ కాబట్టి చాలా భయపడిపోయిందట. బాలయ్య చాలా కోపంగా ఉంటారు. అలా ఉంటారు.. ఇలా ఉంటారు.. అని అందరూ భయపెట్టేశారట.


కానీ బాలయ్య మాత్రం ఇంద్రజ ‘గుడ్‌మార్నింగ్‌ చెప్పగానే లేచి నిలబడి రెండు చేతులు జోడించి ‘గుడ్‌ మార్నింగ్‌’ చెప్పారట. ఇవీ ఇంద్రజ చెప్పిన బాలయ్య ముచ్చట్లు..



మరింత సమాచారం తెలుసుకోండి: