ప్రముఖ ఆంగ్ల పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ 2017 ర్యాంకుల జాబితా కలకలం సృష్టిస్తోంది. ఈ జాబితాలో  ఇండియన్ ఫిట్‌నెస్ మోడల్, టెలివిజన్ నటుడు బాసీర్ ఆలీ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అందరు టాలీవుడ్ హీరోలకు షాక్ ఇచ్చేశాడు. 

Image result for vijay devarakonda

ఇక హీరోల విషయానికి వస్తే.. అర్జున్‌రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు. లాస్ట్ ఇయర్ 20 వస్థానంలో ఉన్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి ఘన విజయంతో సెకండ్ ప్లేస్ కు దూసుకెళ్లాడు. ఇక విజయ్ దేవరకొండ తర్వాత ప్లేస్ లో ప్రభాస్ ఉన్నాడు. హీరోల విషయానికి వస్తే విజయ్ దేవరకొండ నెంబర్ 1, ప్రభాస్ నెంబర్ 2..

Image result for prabhas
ఇక మిలిగినవారి విషయానికి వస్తే.. మహేశ్ బాబు ది నాలుగో ర్యాంక్..  రాంచరణ్ ఐదో ర్యాంక్, అల్లు అర్జున్ ఆరో ర్యాంక్ సంపాదించారు. పాపం రానా గతేడాది నాలుగో స్థానందక్కించుకుని ఈ ఏడాది ఏడో స్థానానికి పడిపోయాడు. గతేడాది ఐదో ప్లేస్ లో ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు 9 స్థానంలో సెటిలయ్యాడు.  గతేడాది మూడో ప్లేస్ లో ఉన్న నాని పాపం ఈ సారి ఏకంగా పదో ప్లేస్ కు పడిపోవడం విశేషం. 

Image result for mahesh ntr

మిగిలినవారి స్థానాలు ఇలా ఉన్నాయి.. రామ్ 11, నాగచైతన్య 12, అఖిల్ 13, నితిన్ 16, వరుణ్ తేజ్ 17, జగపతిబాబు 18, నిఖిల్ 21, ప్రిన్స్ 22, నవదీప్ 24 ఉన్నారు. అన్నింటికంటే విచిత్రం ఏంటంటే.. పొలిటికల్ స్టార్, తెలంగాణ మంత్రి కేటీఆర్ 19 వ స్థానంలో ఉన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: