తెలుగు ఇండస్ట్రీలో మొదటి సారిగా సినీ తారలపై బయోపిక్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలనాటి మహానటి సావిత్రి జీవితం ఆధారంగా చేసుకొని ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  మహానటి సావిత్రి పాత్రలో మళియాళ బ్యూటీ కీర్తి సురేష్ నటిస్తున్నారు.   కాగా ఈ మూవీలో దుల్క‌ర్ స‌ల్మాన్ మ‌హాన‌టి సావిత్రి భ‌ర్త జెమినీ గ‌ణేష‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు.   
Image result for mahanati
అయితే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫస్ట్ లుక్స్ బయటకు వచ్చాయి. అంతే కాదు టైటిల్ టీజర్ కూడా రిలీజ్ చేశారు.  తాజాగా  ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమాను ప్రారంభిం చడానికి ముందే ప్రీ ప్రొడక్షన్‌ సమయంలో సావిత్రి కథను తెలుసుకునేం దుకు దర్శకుడు నాగ్‌అశ్విన్‌ ఎన్నో పరిశోధనలు చేశారట.
Image result for mahanati
కాగా ఈ మూవీలో దుల్క‌ర్ స‌ల్మాన్ మ‌హాన‌టి సావిత్రి భ‌ర్త జెమినీ గ‌ణేష‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు.. ఈ ఇద్ద‌రు క‌ల‌సి ఉన్న ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఫోటో ఎంతో చ‌క్క‌గా ఉంది.   
Related image
ఈ చిత్రం వైజయంతీ మూవీస్‌ పతాకంపై ప్రియాంకదత్‌ నిర్మిస్తున్నారు. కీలక పాత్రల్లో ప్రముఖ నటి సమంత, ప్రకాష్‌రాజ్‌, విజయ్‌ దేవరకొండ, ప్రగ్యజైస్వాల్ , షాలినిపాండే త‌దిత‌రులు న‌టిస్తున్నారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో  నాగ చైతన్య కూడా నటిస్తున్నట్లు ఈ మద్య ప్రచారం జరుగుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: