తెలుగు ఇండస్ట్రీలో ‘ధృవ’ తో మంచి విజయం అందుకున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన తదుపరి చిత్రం కూడా మంచి సక్సెస్ కావాలని పక్కా ప్లాన్ లో ఉన్నాడు.  లెక్కల మాస్టార్ సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ చిత్రంలో రాంచరణ్ ఓ విభిన్నమైన పాత్రలో పోషిస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్స్, సాంగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. సుక్కు దర్శకత్వం..రాంచరణ్, సమంతల లుకింగ్, దేవీ శ్రీ సంగీతం వెరసి సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. 

సమ్మర్ సీజన్ లో బ్లాక్ బస్టర్ మూవీ అని మెగా అభిమానులు మంచి అంచనాలే వేసుకుంటున్నారు.   లెంగ్తీ మూవీ అనే ఇండికేషన్స్ ఉన్న ఈ సినిమాలో ఐదు పాటలు ఉంటాయని చెప్పేశారు మేకర్స్. మొదటగా ఒక్కో పాటను విడుదల చేసిన రంగస్థలం టీమ్.. ఇప్పుడు ఆడియో మొత్తాన్ని ఇచ్చేశారు. రంగస్థలం ఆల్బంలో చివరగా వినిపించే పాట జిగేలురాణి.
Image result for Rangasthalam
1985నాటి కొబ్బరితోటల అయిటమ్ సాంగ్ రాయించేసాడు సుకుమార్..'జిల్ జిల్ జిగేలు రాణి' అంటూ. పక్కగా బావలు సయ్యా.. పాట కాలం నాటి సాహిత్యాన్ని మళ్లీ గుర్తు చేసాడు చంద్రబోస్. ఐటెం సాంగ్స్ అందించడంలో తన ప్రత్యేకతను చాటే దేవిశ్రీ ప్రసాద్.. మరోసారి ఇరగదీసే రేంజ్ లో జిగేలు రాణి పాటను కంపోజ్ చేశాడు. ప్రతీ లైన్ క్యాచీగా ఉండగా.. ప్రతీ బీట్ అదిరిపోయింది..జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాణి. 
Image result for Rangasthalam
మొత్తానికి సుకుమార్ ధైర్యం ఏమిటో కానీ, ఆల్బమ్ లో ఒక్క డ్యూయట్ కూడా లేదు. కానీ రంగమ్మా మంగమ్మా టీజింగ్ సాంగ్, జిగేలు రాణి అయిటమ్ సాంగ్, ఎంత సక్కంగున్నావే లాంటి క్లాస్ ఆడియన్స్ ని సమ్మోహితులను చేయడానికి రెడీ అయినట్లు కనిపిస్తుంది. 
Image result for Rangasthalam
ఇక ఈ పాటకు ప్రతీ ఒక్కరూ డ్యాన్సులు చేయడం ఖాయం అంటూ పూజా హెగ్డే ఇప్పటికే చెప్పేసింది. ఇంకేముంది..రాంచరణ్ స్టెప్పులకు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: