పవన్ త్రివిక్రమ్ ల సాన్నిహిత్యం ఓపెన్ సీక్రెట్ పవన్ అతి తక్కువగా తన వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకునే వ్యక్తులలో త్రివిక్రమ్ మొదటి వరసలో ఉంటాడు అన్న వార్తలు ఎన్నోసార్లు వచ్చాయి. అలాంటి పవన్ ఇప్పుడు తన రాజకీయాల విషయంలో త్రివిక్రమ్ నుండి సలహాలు తీసుకోవడం మానేసాడు అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 
PAVAN JANASENA SPEECH PHOTOS కోసం చిత్ర ఫలితం
వాస్తవానికి 2014 గులో పవన్ ‘జనసేన’ పార్టీని ప్రారంభించినప్పుడు ఆ మొదటి సమావేశంలో ఆవేశపూరితంగా చేసిన పవన్ ఉపన్యాసాన్ని అంతా వ్రాసి ఇచ్చింది త్రివిక్రమ్ అన్న వార్తలు గతంలో చాల సార్లు హడావిడి చేసాయి.  అయితే ఏమయిందో ఏమో తెలియదు కాని ‘అజ్ఞాతవాసి’ పరాజయం తరువాత పవన్ త్రివిక్రమ్ వద్ద సలహాలు తీసుకోవడం తగ్గించివేశాడని దీనితో వీరిద్దరూ వ్యక్తిగతంగా కలిసే సందర్భాలు కూడ తగ్గిపోయాయి అంటూ మరి కొన్ని గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.
అదే ఆయుధం.. అధికారమే లక్ష్యం
మొన్న గుంటూర్ లో పవన్ స్పీచ్ గుంటూరు శేషేంద్రశర్మ కవిత్వంతో ప్రారంభం అయినా ఆ తరువాత పవన్ మాట్లాడిన స్పీచ్ లోని మాటలు ఏమి త్రివిక్రమ్ స్క్రిప్ట్ ను గుర్తుకు వచ్చే విధంగా లేకపోవడంతో పవన్ త్రివిక్రమ్ ల మధ్య నిజంగానే దూరం పెరిగిందా అంటూ మరికొందరు విశ్లేషణలు చేస్తున్నారు. ఇది చాలదు అన్నట్లుగా పవన్ తనతో వంద కోట్ల పెట్టుబడి పెట్టి సినిమా తీస్తే 1000 కోట్ల ఆదాయం వస్తుందంటూ చెప్పిన మాటలు చాలామందికి షాక్ ఇస్తున్నాయి.
PAVAN AGYATHA VASI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
‘అజ్ఞాతవాసి’ సినిమాను కొనుక్కుని తీవ్రంగా నష్టపోయాము అంటూ చాలమంది బయ్యర్లు ఇప్పటికీ గగ్గోలు పెడుతూ ఉంటే పవన్ సినిమాలకు 1000 కోట్ల టర్న్ ఓవర్ ఎక్కడ అయింది అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇది ఇలా ఉండగా పవన్ పెంచిన వేగానికి మించిపోయిన వేగంతో అనేక మంది పవన్ ను టార్గెట్ చేస్తున్న కామెంట్స్ ను మీడియా చాల ప్రముఖంగా ప్రసారం చేస్తున్న నేపధ్యంలో పవన్ ప్రయాణిస్తున్న రాజకీయ రైలు ప్రముఖ కవి ఆరుద్ర చెప్పినట్లుగా ‘నేను ఎక్కవలసిన రైలు ఒక జీవిత కాలం లేటు’ అన్న మాటలను నిజం చేస్తుందా అని అనిపించడం సహజం..  


మరింత సమాచారం తెలుసుకోండి: