‘వస్తున్నాడు.. వచ్చేస్తున్నాడు!! మనందరి ఆశాజ్యోతి.. ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ..’ అంటూ మంచిలక్షణాలున్న అబ్బాయిగా చెప్పుకునే కళ్యాణ్ రామ్.. ‘ఎమ్మెల్యే’ టీజర్ తో ఆ మద్య దుమ్మురేపిన కళ్యాన్ రామ్ తాజాగా  “ఎమ్మెల్యే” ట్రైలర్ మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.  పంచ్ డైలాగ్స్ తో చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు.  నందమూరి కళ్యాణ్ రామ్, కాజల్ జంటగా.. ఉపేంద్ మాధవ్ దర్శకత్వం కామెడీ ఎంటర్‌ట్రైనర్‌గా తెరకెక్కుతున్న ‘ఎమ్మెల్యే’ చిత్రాన్ని వచ్చే మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
‘ఎమ్మెల్యే’ టీజర్
‘మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి’ అనేది ఉపశీర్షిక ఉ భరత్‌ చౌదరి, కిరణ్‌ రెడ్డి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  గురువారం సాయంత్రం 5 గంటలకు “ఎమ్మెల్యే” ఆడియో విడుదలైంది. ఈ చిత్రంలోని “మోస్ట్ వాంటెడ్ అబ్బాయి” అనే పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక సినిమాలో ఒక్కో డైలాగ్ చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి.

‘పిల్లలకు ఆస్తులిస్తే..అవి ఉంటేనే బతుకుతారు..అదే చదువునిస్తే..ఎలాగైనా బతుకుతారు’, ‘పోటీ చేసి నాతో గెలవడం కన్నా నాతో పోటీ అంటేనే భయపడుతున్నారంటే..అదే నా గెలుపు అన్నయ్య’, ‘నేనింకా రాజకీయం చేయడం మొదలు పెట్టలేదు..మొదలు పెడితే..మీరు చేయడానికి ఏమీ మిగలదు’...అంటూ సినిమాపై మంచి అంచనాలే పెంచుతున్నాయి.

ఈ చిత్రాన్ని ఈనెల 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది…యు/ఎ స‌ర్టిఫికెట్ ల‌భించింది… కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో పొలిటీషియన్ గా కనిపించనున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: