చిరంజీవి తరువాత మెగా ఫ్యామిలీలో నెంబర్ 2 స్థానానికి అల్లు అర్జున్ కు రామ్ చరణ్ కు మధ్య పోటీ ఉందని ఆపోటీ వల్లే వారిద్దరి మధ్య బయటపడని గ్యాప్ ఉంది అన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇలాంటి విషయాలలో చాల తెలివిగా వ్యవహరించే అల్లు అర్జున్ తన లేటెస్ట్ మూవీ ‘నాపేరు సూర్య’ విషయంలో రామ్ చరణ్ ‘రంగస్థలం’ కోసం అనుసరిస్తున్న వ్యూహాలు ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. 
allu arjun in naa peru surya కోసం చిత్ర ఫలితం
ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న గాసిప్పుల ప్రకారం ఆమధ్య రంగస్థలం ప్రొడ్యూసర్లకు అల్లు అర్జున్ ఫోన్ చేయించి ‘నా పేరు సూర్య’ ‘రంగస్థలం’ సినిమాలకు సంబంధించిన కంటెంట్ లు విడుదల విషయంలో ప్లాన్డ్ గా చేయాలని సలహాలు ఇప్పించినట్లు టాక్. అంటే బన్నీ చరణ్ ల సినిమాల టీజర్లు కానీ అదేవిధంగా పాటలు కానీ ఒకే రోజున విడుదల కాకుండా గ్యాప్ ఉండేలా చూసుకోవాలని బన్నీ అభిప్రాయం అని తెలుస్తోంది.
allu arjun in naa peru surya కోసం చిత్ర ఫలితం
ఇది చాలదు అన్నట్లుగా భవిష్యత్ లో బన్నీ కొరటాల శివతో సినిమా చేయాలని అభిప్రాయ పడుతున్న నేపధ్యంలో మహేష్ ‘భరత్ అనే నేను’ మూవీని టార్గెట్ చేస్తూ తన ‘నాపేరు సూర్య’ మూవీ పబ్లిసిటీ వద్దని వ్యూహాత్మకంగా బన్నీ తన నిర్మాతలకు చెపుతున్నట్లు టాక్. దీనితో ‘నాపేరు సూర్య’ కు సబంధించిన పబ్లిసిటీ ఉగాది రోజున కానీ శ్రీరామనవమి రోజున కానీ ఏది ఉండదని ఆ స్పేస్ అంతా చరణ్ ‘రంగస్థలం’ కు మహేష్ ‘భరత్ అనే నేను’ కు ఇచ్చే విధంగా బన్నీ తన వ్యూహాలు మార్చాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
allu arjun in naa peru surya కోసం చిత్ర ఫలితం
దీనినిబట్టి చూస్తుంటే తనకు చరణ్ కు మధ్య ఏర్పడ్డ గ్యాప్ ను తగ్గించుకోవడానికి అల్లు వారి అబ్బాయి చాల వ్యూహాత్మకంగా అనుసరిస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే ఇది అంతా చరణ్ పై ప్రేమ అనుకోవాలా లేదంటే అల్లు అర్జున్ ‘నాపేరు సూర్య’ కు రిపేర్లు చేస్తున్నాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇలా వ్యూహాలు మార్చుకున్నాడా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: