శ్రీయ శరన్ సౌత్ లో ఉన్న టాప్ హీరోలు అందరితో నటించిన ట్రాక్  రికార్డు ఆమె సొంతం. ఈమె నటించిన పలు చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఈమెకు లక్కీ హీరోయిన్ ఆఫ్ ది సౌత్ అనే పేరు కూడ ఉంది. అతి తక్కువ కాలంలో  అందరి టాప్ హీరోలతో నటించిన ఈమెకు అందంతో పాటు  నటించే సమర్ధత కూడ కలిసి రావడంతో ఇప్పటికీ ఈమెకు అనేక మంది సీనియర్ హీరోలు పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు.  
SHRIYA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
గత కొంతకాలంగా శ్రీయ రష్యాకు చెందిన టెన్నిస్ ఆటగాడు ఆండ్రీ కోచీవ్ తో రహస్య ప్రేమాయణం సాగిస్తోంది అని మీడియాలో వార్తలు వచ్చినా ఆవార్తలను ఈమె అనేక సార్లు ఖండించింది.  ఇలాంటి పరిస్థితులలో శ్రీయ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తన రష్యన్ ప్రియుడిని ముంబాయిలోని తన నివాసంలోనే రహస్య వివాహం చేసుకున్నట్లు బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది.  
సంబంధిత చిత్రం
కేవలం కుటుంబ సభ్యులు కొద్దిమంది మిత్రుల సమక్షంలోనే ఈవివాహం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. తనకు పెళ్లి అయిన విషయాన్ని శ్రీయ అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ఈమె మీడియా తన పెళ్లి వార్తని అభిమానులతో పంచుకునే అవకాశం ఉంది అని అంటున్నారు.  
SHRIYA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
శ్రీయ తెలుగులో గత ఏడాది ‘పైసా వసూల్’ మూవీలో బాలకృష్ణ సరసన నటించిన విషయం తెలిసిందే. 35 ఏళ్ళ వయస్సుకు దగ్గరలో ఆమె ఉన్నాఇంకా ఆమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. దీనితో పెళ్లి తరువాత కూడ శ్రీయ ఇక సినిమాల్లో నటిస్తుందా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.  ఈ వార్తలే నిజం అయితే మన సీనియర్ టాప్ హీరోలకు హీరోయిన్స్ సమస్య మరింత పెరిగిపోతుంది. ఏది ఎలా ఉన్నా శ్రియ రహస్య పెళ్లి ప్రస్తుతానికి మీడియాకు హాట్ టాపిక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: