తెలుగు లో వచ్చిన బిగ్ బాస్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. పద్నాలు మంది కంటెస్టంట్లతో బిగ్ బాస్ షో ప్రతిరోజు ఎంతో ఉత్కంఠంగా సాగింది.  ఇక వీక్ ఎండ్ లో ఎన్టీఆర్ చేసే హంగామాతో ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేశారు. ఒకరకంగా చెప్పాలంటే..బిగ్ బాస్ షో లో సభ్యులు చేసే హడావిడి కన్నా ఎన్టీఆర్ ఒక్కటీ, రెండు రోజులు చేసే హడావుడే ఎక్కువగా ఉండేది.
బిగ్ బాస్ హోస్ట్: తారక్ స్థానంలో నేచురల్ స్టార్?
స్టార్ మా టీవీలో ప్రసారమైన తెలుగు బిగ్‌బాస్ సీజన్ -1కి వ్యాఖ్యాతగా సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ బాగా పాపులారిటీ సంపాదించారు. తనదైన స్టయిల్‌తో, మాటతీరుతో తారక్ బిగ్ బాస్‌కు కొత్తదనం తీసుకొచ్చాడు. ఈ ప్రోగ్రాం విజయవంతం కావడంలో ప్రధాన క్రెడిట్ అతడిదే. ఈ ఏడాది వ్యక్తిగత, వృత్తిపరమైన కమిట్‌మెంట్స్ కారణంగా ఎన్టీఆర్ ఈ షో నుంచి బయటకు వెళ్తున్నాడు. 

అయితే, ఇప్పుడు ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో బిగ్‌బాస్‌-2 సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశాలు లేకపోవడంతో ఆయన స్థానంలో నేచురల్ స్టార్ నానిని లేక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ని తీసుకుంటారని ఇటీవల ప్రచారం జరిగింది.  ఎన్టీఆర్ స్థానంలో బిగ్ బాస్ షో నడిపేందుకు చాలా మంది హీరోలు పోటీపడ్డారు.   

నాని రేడియో జాకీగా కెరీర్ ఆరంభించాడు. ఆ అనుభవం బిగ్ బాస్‌కు పనికొస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారట. నేచురల్ స్టార్ గత అనుభవంతోపాటు.. నటనలో అతడి సహజత్వం, పాపులరిటీ షోకు ఉపయోగపడుతుందని బిగ్ బాస్ నిర్వాహకులు ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో సీజన్ -2 లో ఆయననే హోస్ట్‌గా తీసుకోవాలని నిర్వాహకులు భావించి అందుకోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: