‘రంగస్థలం’ విడుదలకు కౌంట్ డౌన్ ప్రారంభం కావడంతో రామ్ చరణ్ ఈమూవీ ప్రమోషన్ వేగం పెంచాడు. ఈనేపధ్యంలో ప్ర‌ముఖ ఐటీ కంపెనీ ‘వ‌ర్చ్యూస్’ ఉద్యోగులు ఏర్పాటు చేసిన జోష్ ఫాంట‌సీ సెస‌న్-4 ప్రొగ్రామ్ కు అతిధిగా చరణ్ హాజరు అయ్యాడు. అనేక ప్రముఖ ఐటీ కంపెనీ  ఉద్యోగుల ఆట పాటల కార్యక్రంగా నిర్వహించిన ఈ కార్యక్రమం హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలో ఘ‌నంగా జ‌రిగింది. 
అద్భుతంగా రంగస్థలం..
‘రంగ‌స్థ‌లం’ సినిమా కోసం ఏడాదిపాటు కష్టపడి పెంచుకున్న గుబురు గెడ్డం మీసం తీసివేసి చరణ్ ఈకార్యక్రమానికి రావడంతో మీడియా కెమెరాల దృష్టి అంతా చరణ్ న్యూలుక్ పై పడింది. ఈకార్యక్రమంలో పాల్గొన్న చరణ్ అందరికీ జ్ఞాపిక‌ల్ని ప్ర‌శంసాప‌త్రాలను అందచేసాడు.
RAMCHARAN IN RANGASTHALAM MOVIE PHOTOS కోసం చిత్ర ఫలితం
అనంత‌రం రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ ‘మీరు చూపిస్తోన్న ఉత్సాహాం మిమ్మ‌ల్ని అంద‌ర్నీ చూస్తుంటే నాకు నాకాలేజ్ డేస్ గుర్తుకొస్తున్నాయి. మీఅంద‌ర్నీ ఇలా క‌ల‌వ‌డం చాల సంతోషంగా ఉంది. ఈనెల‌లో నాకిది బెస్ట్ డే ప్ర‌తీకంపెనీకి ఉద్యోగులే కీల‌కం. వాళ్ల క‌ష్టంతోనే కంపెనీలు పైకొస్తాయి. ఇక్క‌డ ఉద్యోగులే వర్య్చూస్ కంపెనీని ఈస్థాయిలో నిల‌బెట్టార‌నిపిస్తోంది. వర్చ్యూస్ లో ప‌నిచేస్తున్న చాలమంది ఉద్యోగులు ర‌క్త‌దానం చేశారు. చాలా మంచి సేవా కార్య‌క్ర‌మం అది. మేము  ప్రారంభించిన ఈ కార్య‌క్ర‌మాన్ని ఇంత‌మంది ఎంతో బాధ్య‌త తీసుకుని చేస్తున్నంద‌కు చాలా గ‌ర్వంగా ఉంది. ఇలాగే మ‌రిన్ని మంచి కార్య‌క్ర‌మాలు చేయాల‌ని కోరుకుంటున్నా’ అంటూ తన ఉపన్యాసాన్ని ముగించాడు.
RAMCHARAN IN RANGASTHALAM MOVIE PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇదే సందర్భంలో చరణ్ తన ‘రంగ‌స్థ‌లం’ సినిమా గురించి మాట్లాడుతూ ఈసినిమా తనకు కొత్త అనుభూతినిచ్చింది అంటూ తన గ‌త సినిమాలు మిస్ అయినా ఈసినిమా మాత్రం త‌ప్ప‌కుండా అంద‌రూ చూడండి అంటూ ప్రమోట్ చేసాడు. దీనితో ఈకార్యక్రమానికి వచ్చిన కొంతమంది చరణ్  తాను గతంలో నటించిన సినిమాలు అంత బాగారాలేదు అన్న విషయాన్ని అంతర్లీనంగా ఒప్పు కుంటున్నాడా అంటూ కామెంట్స్ చేసుకున్నట్లు టాక్. ఏది ఏమైనా చరణ్ ‘రంగస్థలం’ పై పెట్టుకున్న ఆశలు ఎంతవరకు నెరవేరతాయో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: