తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు అందరి చూపు చిట్టిబాబు పైనే ఉంది. ఇంతకీ చిట్టిబాబు ఎవరా అనుకుంటున్నారా..! సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ చిత్రం లో నటిస్తున్న రాంచరణ్ పేరు ‘చిట్టిబాబు’.  ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ లు రిలీజ్ అయిన విషయం తెలిసిందే.  ‘రంగస్థలం’ చిత్రంలో రాంచరణ్ సౌండ్ ఇజనీర్..అదేనండీ చెవిటివాడిగా నటిస్తున్నాడు. 
Image result for magadheera
ఇప్పటి వరకు అన్ని సినిమాల్లో చాలా స్టైలిష్ గా కనిపించిన రాంచరణ్ ఈ చిత్రంలో గుబురు గడ్డంతో అచ్చం పల్లెటూరి కుర్రాడి పాత్రలో అద్భుతంగా నటించాడట.  ఇక సమంత కూడా సీతామాలక్ష్మిగా పల్లెటూరి అమ్మాయిగా నటించింది. నిన్న విశాఖలో ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ సందర్భంగా  సినిమా థియేటరికల్ ట్రైలర్ ను విడుదల చేయగా, దాన్ని చూసిన దర్శక దిగ్గజం రాజమౌళి స్పందించారు.  గతంలో రాజమౌళి, రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘మగధీర’ సెన్సేషన్ బ్లాక్ బస్టర్ సాధించిన విషయం తెలిసిందే.
Image result for rangastalam movie
త్వరలో రాంచరణ్, ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ చిత్రం కూడా తెరకెక్కించబోతున్నారు రాజమౌళి.  తాజాగా ‘రంగస్థలం’ చిత్రం ట్రైలర్ చూసి రాజమౌళి ఎంతో సంతోషించారట. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెడుతూ, చిట్టిబాబు తనకు మరింత దగ్గరయ్యాడని, ఈ ట్రైలర్ చూసిన తరువాత అతనిపై తనకున్న ఆప్యాయత మరింతగా పెరిగిందని అన్నారు.
Image result for rangastalam movie
అంతే కాదు ఈ చింత్రంలో అన్ని క్యారెక్టర్లు చాలా అద్భుతంగా పండించినట్లు తెలుస్తుంది. జగపతి బాబు పాత్ర కూడా బాగుందని, ఈ సినిమా రిలీజ్ కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చారు. రాజమౌళి ఈ ఉదయం 11.21 గంటల సమయంలో పెట్టిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుండగా, వేల మంది లైక్స్ కొడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: