మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా కోసం టాలీవుడ్ ఆడియన్స్ ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. ‘ఖైదీ నెంబర్ 150’తో రీఎంట్రీలోనే బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా చూపిన చిరు.. తర్వాతి సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సైరా నరసింహా రెడ్డి అంటూ.. టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే మూవీని చేస్తున్నారు చిరు. గత ఏడాది డిసెంబర్ లోనే మొదలైన సైరా మూవీ షూటింగ్ మాత్రం అనుకున్నంత సాఫీగా జరగడంలేదు. మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా కూడా ప్రస్తుతం సైరా సెకండ్ షెడ్యూల్ మాత్రం స్టార్ అయ్యింది. 

Image result for seaira narasimha reddy

ప్రస్తుతం హైదరాబాద్ లో నిర్మించిన అతి భారీ సెట్ లో షూటింగ్ జరుపుకుంటున్నం సైరా సినిమా సెట్స్ నుండి ఒక పిక్ లీకైంది. మరి అలా ఎటువంటి న్యూస్ గాని, పిక్స్ గాని లీక్ కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఇలా సైరా షూటింగ్ పిక్ లీక్ అవడంతో సైరా యూనిట్ షాక్ అయింది. షూటింగ్ స్పాట్ నుంచి.. సినిమా అప్ డేట్స్ లీక్ కాకుండా.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ ఎలా ఉండనున్నారనే లుక్ ఒకటి బయటకు వచ్చేసింది. 

Image result for seaira narasimha reddy

షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి పక్క బిల్డింగ్ మీద నుంచి తీసిన ఈ లుక్ లో.. నరసింహారెడ్డి పాత్రలో చిరు లుక్ ను లీక్ చేసేస్తోంది. యూనిట్‌ సభ్యుల్లో ఒకరు సీక్రెట్‌గా క్లిక్ మనిపించిన ఫోటో ఇది. లీకైన అయిన విషయాన్ని తెలుసుకున్న యూనిట్‌.. వెంటనే దానిని తొలగించింది. ఈ వ్యవహారంపై చిరుతోపాటు చెర్రీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పబ్లిసిటీ కోసమే యూనిట్ ఇలా చేసిందన్న వాదన కూడా లేకపోలేదు. 

Image result for seaira narasimha reddy shooting

మొత్తానికి షూటింగ్ మొదలు ఫస్ట్ పిక్ బయటకువచ్చింది.ఆ లీకైన పిక్ లో చిరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లుక్ అంతగా స్పష్టంగా కనబడడం లేదు… కానీ ఈ లీకెడ్ పిక్ మాత్రం నెట్ లో వైరల్ అయ్యింది. ఇక మెగాస్టార్ ఈ పిక్ లో క్లారిటీగా కనబడడం లేదుగాని లేకుంటే యూనిట్ మాత్రం మరింత కంగారు పడాల్సి వచ్చేది. భారీ స్టార్ కాస్ట్ నటిస్తున్న ఈ సినిమా ని సురేందర్ రెడ్డి ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: