ఆ మద్య పవన్ కళ్యాన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘అత్తారింటికి దారేది' తన అందాలతో ప్రేక్షకుల గుండెను కొల్లగొట్టిన కన్నడ భామ ప్రణిత. ప్రణీత సుభాష్  కన్నడ, తెలుగు, తమిళ్ భాషల్లో నటిస్తుంది. 2010లో పూరి జగన్నాథ్ తెలుగులో తీసిన పోకిరి సినిమా కన్నడ రీమేక్ పోర్కి సినిమాతో కన్నడలో, ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది. పోర్కి హిట్ తర్వాత సిద్దార్థ్ సరసన తెలుగులో   నటించిన బావ (2010) సినిమా మంచి పేరును తీసుకొచ్చింది.
Image result for actress pranitha
2011లో ఉదయన్ సినిమాతో తమిళంలో  ఎంట్రీ ఇచ్చింది.  ఉదయన్ ఫ్లాప్ అయినా జరాసంధ (2011), భీమ తీరడల్లి (2012), విజిల్ (2013), బ్రహ్మ (2014) సినిమాలతో కన్నడ పరిశ్రమలో పెద్ద కథానాయికగా ఎదిగింది. తెలుగులో అత్తారింటికి దారేది (2013) సినిమా ద్వారా ఇక్కడ కూడా పెద్ద తారగా ఎదిగింది. ఆ తర్వాత తను నటించిన పాండవులు పాండవులు తుమ్మెద (2014) సినిమా కూడా తనకు మంచి పేరును తెచ్చిపెట్టింది. 
బాత్ టబ్‌లో హీరోయిన్ గ్లామర్ షో!
ఈ మద్య హీరోయిన్లు వీలు చిక్కినప్పుడల్లా ఫోటో షూట్స్ తో నెటిజన్లకు బాగా దగ్గర అవుతున్నారు.  తాజాగా ఈ జాబితాలోనే చేరింది.. ప్రణీతా సుభాష్. పలు తెలుగు సినిమాల్లో నటించినా.. ఎక్కువగా సెకెండ్ హీరోయిన్ పాత్రలే వచ్చాయి ఈ కన్నడ భామకు.పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు వంటి హీరోల సినిమాల్లో ద్వితీయ ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ పాత్రలో నటించింది ప్రణీత.
Image result for actress pranitha
వాటితో కొంత గుర్తింపు దక్కింది కానీ.. స్టార్ స్టేటస్ రాలేదు. గ‌త కొంత కాలంగా తెలుగు చిత్రాల‌కు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ‌.. ఫొటోషూట్‌ల‌తో త‌రుచుగా త‌న ఉనికిని చాటుకుంటోంది. తాజాగా.. బాత్‌ట‌బ్‌లో గ్లామ‌ర్ చిందిస్తూ దిగిన ఓ ఫొటోని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ప్ర‌ణీత‌. ప్ర‌స్తుతం ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: