తెలుగు ఇండస్ట్రీలో ఎస్ ఎస్ రాజమౌళి అంటే..ఓటమి ఎరుగని దర్శకధీరుడు అని అంటారు.  స్టూడెంట్ నెం.1 చిత్రం నుంచి బాహుబలి 2 వరకు ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేశారు.  ఇక బాహుబలి, బాహుబలి 2 తో ఏకంగా ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా సత్తా ఎంటో రుచి చూపించాడు.  ఇప్పటి వరకు భారతీ చలన చిత్ర రంగంలో బాలీవుడ్, కోలీవుడ్ కి మాత్రమే సొంతమైన రికార్డులు బాహుబలి 2 తో బ్రేక్ చేశాడు.
Image result for ntr rajamouli
అంతే కాదు భారతీయ చలన చిత్ర చరిత్రలో అత్యధిక రూ.1600 కోట్లు వసూళ్లు చేసిన చిత్రంగా మిగిలింది.  బాహుబలి 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాజమౌళి స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్, రాంచరణ్ లతో మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గత కొంత కాలంగా రామ్ చ‌ర‌ణ్ తేజ్, జూనియ‌ర్ ఎన్టీఆర్, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రానుందని కొన్ని నెలలుగా వార్తలు చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే.
Image result for ram charan rajamouli
ఆ వార్తలకు బలాన్ని చేకూర్చుతూ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ రోజు ఆర్ఆర్ఆర్ ప్రకటన పేరిట 23 సెకన్లు ఉన్న ఓ వీడియో విడుదల చేసింది. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ తమ యూట్యూబ్ చానెల్ ఆర్ఆర్ఆర్ (రాజమౌళి, రామ్‌చరణ్, రామారావు) అంటూ ఈ వీడియో విడుదల చేయడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ వీడియోపై స్పందించిన రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన.. తన ట్విట్టర్ ఖాతాల్లో దీన్ని పోస్ట్ చేసి 'ఇది ఏమిటి రామ్‌చరణ్?' అని ప్రశ్నించింది.
Image result for ram charan ntr
ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.  రాజమౌళి మాత్రం సింపుల్ గా అలా అనౌన్స్ చేయడంపై కాస్త నిరాశ చెందారు. డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. అక్టోబర్ నుండి ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ఇద్దరు హీరోలు ఈ మూవీ లో పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: