జూనియర్ చరణ్ లతో రాజమౌళి తీయబోతున్న మల్టీ స్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ టీజర్ విడుదలైన తరువాత ఈ టీజర్ సోషల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈసినిమా కథకు సంబంధించి అనేక ఊహాగానాలు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న నేపధ్యంలో ఈ టీజర్ ద్వారా ఈసినిమా కథకు సంబంధించి ఏమైనా లీకులు దొరుకుతాయేమో అని అనేక మంది ఆసక్తిపరులు ఒకటికి పదిసార్లు ఈ టీజర్ ను చాలా నిశితంగా పరిశీలించినట్లు వార్తలు వస్తున్నాయి. 
సంబంధిత చిత్రం
ఈ సినిమాలో చరణ్ జూనియర్లు అన్న దమ్ములుగా కనిపించబోతున్నారు అన్న వార్తలు వచ్చిన నేపధ్యంలో ఈసినిమాకు సంబంధించి రాజమౌళి ఇప్పటివరకూ టచ్ చేయని జోనర్ ను ఎంచుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. సైన్స్ ఫిక్షన్ థీమ్ తో రామ్ చరణ్ ఎన్టీఆర్ ల పాత్రలకు లింక్ ఉంటుందట. ఈ సినిమాకు అదే అసలు సిసలైన అట్రాక్షన్ అవుతుందని కూడా అంటున్నారు. 
RAJAMOULI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
తెలుస్తున్న సమాచారంమేరకు హాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఒక ప్రముఖ సైన్స్ ఫిక్షన్ మూవీ కథకు అనుసరణగా రాజమౌళి మల్టీ స్టారర్ ఉంటుందని ఒక కొత్త ప్రచారం తెర పైకి వచ్చింది. ఇప్పటి వరకు రాజమౌళి తన గ్రాఫిక్ మాయాజాలాన్ని పునర్జన్మల కథలకు జానపద కథలకు ప్రయోగించినట్లుగానే ఈ సైన్స్ ఫిక్షన్ కథకు కూడ అత్యంత భారీ స్థాయిలో గ్రాఫిక్స్ ఉంటాయని అంటున్నారు. 
RAMCHARAN ALONG WITH JUNIOR LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
రామ్ చరణ్ జూనియర్ లు ఇప్పటి వరకు ఏసినిమాలోను కనిపించని డిఫరెంట్ లుక్స్ ఈమూవీకి కీలక అంశంగా మారనుంది అని టాక్. రాజమౌళి అత్యంత తెలివిగా ఎటువంటి లీకులు లేకుండా ప్రయోగించిన ఈ ‘ఆర్ఆర్ఆర్’ ను అనేక కోణాలలో విశ్లేషిస్తూ అభిమానులు చేస్తున్న కామెంట్స్ ఈమూవీ పై ఉన్న మ్యానియాను సూచిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: