తెలుగు ఇండస్ట్రీలోకి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో చిన్న పాత్రలో ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ‘పెళ్లిచూపులు’ చిత్రంతో హీరోగా మారారు.  ఆ తర్వాత వచ్చిన సినిమా పెద్దగా విజయం సాధించకున్నా సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం మనోడి స్టార్ ఒక్కసారే మార్చేసింది.  మొదటి నుంచి ఎన్నో వివాదాల మద్య తెరకెక్కిన అర్జున్ రెడ్డి థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత దుమ్మురేపే కలెక్షన్లు సాధించింది. 
Image result for vijay devarakonda taxi wala
చిన్న చిత్రంగా రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి పెద్ద సినిమాలకు వచ్చే కలెక్షన్లు సాధించింది.  తాజాగా విజయ్ దేవరకొండ రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో  ‘ట్యాక్సీవాలా’ చిత్రంలో నటిస్తున్నాడు.  విజయ్ దేవరకొండ సరసన ప్రియాంక జ్వల్కర్‌, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ‘ట్యాక్సీవాలా ఫస్ట్‌ గేర్‌’ పేరుతో యూవీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ 2 పిక్చర్స్  తమ తమ యూట్యూబ్ ఛానెళ్లలో ఈ వీడియోను విడుదల చేశాయి.

ఈ వీడియోలో విజయ్ దేవరకొండ మరో యాంగ్ యాంగ్రీ మాన్ లా కనిపిస్తున్నాడు. ట్యాక్సీని వేగంగా నడుపుతూ, కారుపై ఉన్న దుమ్మును దులిపేస్తున్నట్లు ఈ వీడియోలో విజయ్ దేవరకొండ సాహసాన్ని చూపించారు.  ఫుల్ లెన్త్ మాస్ ఎంట్ర టైన్ మెంట్ గా తెరకెక్కబోతున్న ‘ట్యాక్సీవాలా’ లా విజయ్ దేవరకొండ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా టీజర్‌ విడుదల కానుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: