Image result for prabhas sweety

విశ్వవిఖ్యాత టాలీవుడ్ టి-టౌన్ ఆజానుబాహుడు అందగాడైన నటుడు, నమ్మశక్యంకాని నైపుణ్యం కలిగిన మేటి కథానాయకుడు, మోష్ట్ ఎలిజిబుల్ బాచులర్, ప్రభాస్ గుఱించి ఒక జాతీయ నెట్ మాగజైన్ న్యూస్-18 లో ఒక సంచలన వార్త ప్రచురితమైంది. 

Please follow the link: 


టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి రెండు భాగాల ప్రపంచ సంచలన చిత్రం బాహుబలి అనితర సాధ్యంగా విజయం సాధించటంలో, అందులో రెండు పాత్రల్లో అమరేంద్ర బాహుబలిగా ఆపై మహేంద్ర బాహుబలిగా రెండు విభిన్న పాత్రల్లో అద్వితీయంగా నటించిన కథానాయకుడు ప్రభాస్ కీర్తి విశ్వవిఖ్యాతమైంది. 

Image result for konidela niharika prabhas

ఇదే బహుశ ప్రభాస్ కు ఉన్న దేశవ్యాప్త అభిమానుల్లో ఆయన వివాహంపై బలమైన ఉత్కంటతతో పాటు అనేక రకాల పుకార్లను రేపుతుంది. ప్రధానంగా బాహుబలి కథానాయకి దేవసేన పాత్రధారిని అనుష్కా షెట్టిని ఆయన వివాహమాడ బోతున్నారని పుకార్లు షికారు చేశాయి. అప్పుడప్పుడు ఇదే పుకారు కొనసాగుతూ అలాంతిదేమీ లేదంటూ వీరిరువురూ బహిరంగ ప్రకటన చేసినా ఇంకా ఆ పుకారు సమసిపోలేదు. అప్పుడప్పుడు రగుల్తూనే ఉంది. 


Please follow the link: 


ఇప్పుడు కొత్తగా చెలరేగిన బజ్ ఏమంటే టాలీవుడ్ ప్రఖ్యాత కథానాయకుడు వెటరన్ నటుడు చిరంజీవి సోదరుడు నాగబాబు కూతురు నీహారిక కొణిదెల తో పెళ్ళి నిశ్చయ మైనట్లు అన్నారు. కాని దురదృష్ట వశాత్తూ ఇదీ అబద్ధమేనని ఋజువైంది. ఎలా అంటే చిరంజీవి బహిరంగంగా ప్రభాస్-నిహారిక వివాహం అనే అంశం యధార్ధం కాదని చెప్పారు. అంతేకాదు నిహారిక తన వృత్తిపై శ్రద్ధ పెట్టబోతుంది, కాని వివాహానికి ఇప్పుడు సిద్ధంగా లేదని కూడా చిరంజీవి అధికారికంగా చెప్పవలసి వచ్చంది.  

ప్రభాస్ త్వరగా పెళ్ళి చేసుకోకపోతే ఈ షికార్లు చేసే పుకార్లను అరికట్టటం ఇక కష్టమేమో? అదీ బాలీవుడ్ కాబట్టి. 

Image result for chiranjeevi comments on prabhas marriage with niharika

మరింత సమాచారం తెలుసుకోండి: